ఎట్టకేలకు వెంకీ డిసైడ్ అయ్యాడు!!
on Oct 20, 2015
.jpg)
గత కొన్ని నెలలుగా వెంకటేష్ చేయబోయే ఏ ప్రాజెక్టూ ఓ కొలిక్కి రాకపోవడంతో..సడన్ గా వెంకీ మనసు మార్చుకున్నాడట. ఇంతకుముందు చర్చలు జరిపిన దర్శకులతోనే రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడట. సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్ లోనే ఆ రెండు సినిమాలు చేయడానికి పచ్చ జెండా కూడా ఊపేశాడట.ఈ రెండు సినిమాలు దసరా తర్వాత ఒకేసారి మొదలు కాబోతున్నట్లు సమాచారం. చాన్నాళ్ల నుంచి వెంకీని డైరెక్ట్ చేయాలని చూస్తున్న మారుతి దర్శకత్వంలో ఒక సినిమా మొదలవబోతోందట. మరోవైపు ఈ మధ్య వెంకీ తిరస్కారానికి గురైన క్రాంతి మాధవ్ కూడా తిరిగి వెంకీ దగ్గరికే వచ్చాడట. వెంకీనే మళ్లీ అతణ్ని వెనక్కి పిలిచి ముందు అనుకున్న సినిమా చేయడానికి సరే అన్నాడట. ఈ రెండు సినిమాలు దసరా తర్వాత మొదలవుతాయని.. రెండు సినిమాల్ని ఓకే సారి పూర్తి చేసి రిలీజ్ చేస్తారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



