
'నిజాన్ని ప్రజలు మార్చలేరు. కానీ, ఆ నిజం ప్రజల్ని మారుస్తుంది' - శనివారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విక్టరీ వెంకటేష్ పోస్ట్ చేసిన కొటేషన్‌లో మీనింగ్. కొంచెం అటు ఇటుగా ఆయన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నామని ప్రకటించిన సమయంలోనే ఈ స్టోరీ పోస్ట్ చేశారు. చైతూకు మేనమామ కాబట్టి ఈ విడాకుల విషయం వెంకటేష్‌కు ముందే తెలిసి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసే ఆయన ఈ పోస్ట్ చేశారా? అనే సందేహం కొంతమందికి కలుగుతోంది.
.jpg)
నాగచైతన్య, సమంత మధ్య ఏం జరిగిందో? ఎందుకు విడిపోయారో? చిత్ర పరిశ్రమలో చాలామందికి తెలియదు. అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులకు తప్ప! వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమైన నిజం ఏమిటి? అని వెంకటేష్ పోస్ట్ చేశాక ఆలోచన కలుగుతోంది. చై-సామ్ ను మార్చిన ఆ నిజం ఏమిటన్నది త్వరలో తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఏదీ ఎక్కువ కాలం దాగదు. బయటకు వస్తుంది.




.jpg)

