`ఎఫ్ 3`.. వెంకీ హ్యాట్రిక్ మల్టిస్టారర్!
on May 24, 2022
సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కి అచ్చొచ్చిన నిర్మాతల్లో `దిల్` రాజు ఒకరు. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013), `ఎఫ్ 2` (2019) చిత్రాలు రాగా.. అవి రెండు కూడా మంచి విజయం సాధించాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఇద్దరూ `ఎఫ్ 3` కోసం ముచ్చటగా మూడోసారి జట్టుకట్టారు. `ఎఫ్ 2` ఫ్రాంచైజీలో రెండో సినిమాగా తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. సమ్మర్ స్పెషల్ గా ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ఎఫ్ 2`, `ఎఫ్ 3` - ఇలా `దిల్` రాజు బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వెంకీ నటించిన సినిమాలన్నీ మల్టిస్టారర్సే. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కలిసి నటించిన వెంకీ.. `ఎఫ్ 2`, `ఎఫ్ 3`లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరి.. `దిల్` రాజు సంస్థలో ఇప్పటికే రెండు మల్టిస్టారర్స్ హిట్స్ కొట్టిన వెంకటేశ్.. `ఎఫ్ 3`తో హ్యాట్రిక్ బాట పడతారేమో చూడాలి.
కాగా, `ఎఫ్ 3`ని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఇందులో వెంకీకి జంటగా తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ ఎంటర్టైన్ చేయనున్నారు.
Also Read