Home

»

Latest News

టీజ‌ర్ రివ్యూ : గురు

Dec 13, 2016 11:13AM

రీమేక్ రాజాగా పేరు తెచ్చుకొన్నాడు విక్ట‌రీ వెంక‌టేష్‌. వెంకీ కెరీర్‌లో రీమేక్ సినిమాలే ఎక్కువ‌. వాటితోనే విజ‌యాలూ ద‌క్కాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో విజ‌యం సాధించిన సాలా ఖ‌దూస్‌ని `గురు`గా తీసుకొస్తున్నాడు వెంకీ. మాతృక‌లో మాధ‌వ‌న్ పోషించిన పాత్ర‌లో వెంకీ క‌నిపిస్తాడు. రితిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌కురాలు. షూటింగ్ పూర్త‌య్యింది. 2017 జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

మంగ‌ళ‌వారం వెంకీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఓ టీజ‌ర్‌ని వ‌దిలారు. సాధార‌ణంగా టీజ‌ర్‌లో హీరోయిజం ఎలివేట్ చేసే షాట్సో.. డైలాగులో ఉంటాయి. కానీ.. ఈ టీజ‌ర్‌లో వెంకీ స్టెప్పులు వేశాడు. 40 సెక‌న్ల పాటు సాగిన ఈ టీజ‌ర్ చూస్తే `ఓస్ ఇంతేనా` అనిపిస్తుంది. వెంకీ మేకొవ‌ర్ స్ప‌ష్టంగా క‌నిపించినా, ఆ బీట్ ఉర్రూత‌లూగిస్తున్నా... ఏదో వెలితి మాత్రం క‌నిపిస్తోంది. మొత్తానికి `గురు` టీజ‌ర్ జ‌స్ట్ యావ‌రేజ్ అనిపించుకొంది. టీజ‌ర్లో చూపిస్తున్న లొకేష‌న్లు, నాజ‌ర్ గెట‌ప్ ఇవ‌న్నీ చూస్తే `సాలా ఖ‌దూస్‌`ని అచ్చంగా దింపేసిన‌ట్టు అనిపిస్తోంది. మ‌రి ఈ రీమేక్ వెంకీ కెరీర్‌కి ఎంత వ‌ర‌కూ ప్ల‌స్ అవుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com