Home

»

Latest News

`నార‌ప్ప‌` బాట‌లో `దృశ్యం 2` కూడా..!

Sep 28, 2021 4:12PM

విక్ట‌రీ వెంక‌టేశ్ గ‌త చిత్రం `నార‌ప్ప‌`.. క‌రోనా ఎఫెక్ట్ తో ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. వెంకీ అభిమానుల‌తో పాటు స‌గటు వీక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడిదే బాట‌లో వెంకీ న‌టించిన మ‌రో ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ కూడా అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమ్ కానుంద‌ట‌. ఆ చిత్రం మ‌రేదో కాదు.. `దృశ్యం 2`. 2014 నాటి `దృశ్యం`కి ప‌ర్ఫెక్ట్ సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలోనూ వెంకీ, మీనా జంట‌గా న‌టించారు.  

మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన `దృశ్యం`కి రీమేక్ గా తెలుగు `దృశ్యం` రూపొంద‌గా.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 19న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన మ‌ల‌యాళ వెర్ష‌న్ `దృశ్యం 2`(మోహ‌న్ లాల్)కి రీమేక్ గా తెలుగు `దృశ్యం 2` తెర‌కెక్కింది. మాతృక‌ను రూపొందించిన జీతూ జోసెఫ్ నే ఈ సీక్వెల్ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేయ‌డం విశేషం. కాగా, ఆ మ‌ధ్య డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో వెంకీ `దృశ్యం 2` స్ట్రీమ్ కాబోతోంద‌ని జోరుగా ప్రచారం సాగింది. ఆ త‌రువాత మ‌ళ్ళీ థియేట‌ర్స్ లోనే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ద‌స‌రా త‌రువాత అమెజాన్ ప్రైమ్ లో `దృశ్యం 2` నేరుగా స్ట్రీమ్ కాబోతోంద‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com