Home

»

Latest News

వెంకటేష్ హీరోగా దశరథ్ సినిమా

Jun 3, 2011 7:01PM

వెంకటేష్ హీరోగా దశరథ్ సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే "సంతోషం" సినిమాతో దర్శకుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన దశరథ్ ఇటీవల ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దిల్ రాజు నిర్మించిన హిట్ చిత్రం" మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమాకి దర్శకత్వం వహించారు. అలాంటి దశరథ్ రీసెంట్ గా ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కి ఒక విభిన్నమైన కథను చెప్పాడట. ఆ కథ వెంకటేష్ కి నచ్చటంతో ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు రానుంది.

గతంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో "సింహా" సినిమాను నిర్మించిన పరుచూరి కిరీటి తమ యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారట. ప్రస్తుతం శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న "బాడీగార్డ్" సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే వెంకటేష్ హీరోగా, దశరథ్ దర్శకత్వంలోని సినిమా ప్రారంభం అవుతుందని వినికిడి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com