Home

»

Latest News

శివకార్తికేయన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ వెంకట్ ప్రభు: అసలు నిజం ఇదన్నమాట!

Sep 28, 2026 5:01PM

 

'అమరన్' తో ఎంత వాల్యుబుల్, పవర్ ఫుల్ హీరోనో నిరూపించుకున్నాడు శివకార్తికేయన్. కాకపోతే ఆ చిత్రం తర్వాత మరో హిట్ అందుకోవడానికి సినీ ప్రసవ వేదనని అనుభవిస్తున్నాడు. ప్రెజెంట్ 'సియోన్'తో  బిజీ. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. త్వరలోనే రిలీజ్ డేట్ రానుంది. 


స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో  శివకార్తికేయన్ ఒక మూవీ చేస్తున్నాడని  అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో  ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోను భారీ   అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలు, సినిమా పోర్టళ్లలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆగిపోయిందని, వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వకార్తికేయన్ ఈ కథ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని, అందుకే సినిమా నుంచి తప్పుకున్నారనే ప్రచారాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ రూమర్స్‌పై దర్శకుడు వెంకట్ ప్రభు స్వయంగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు. శివకార్తికేయన్‌కు తనకు మధ్య ఎలాంటి మనస్పర్థలు గానీ, వ్యక్తిగత విభేదాలు గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. చిత్రసీమలో 100 శాతానికి పైగా వృత్తిపరమైన అంకితభావం కలిగిన వ్యక్తుల్లో శివకార్తికేయన్ ఒకరని, ప్రతి నటుడికి కథ ఎంపికలో 100 శాతం స్వేచ్ఛ ఉంటుంది. తాము అనుకున్న కథ ప్రస్తుత సమయానికి సరిగ్గా కుదరకపోవడం వలన  తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చిందే తప్ప, ఇతరత్రా వివాదాలేవీ లేవని చెప్పారు.


ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ మ్యాజిక్: నెగెటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురవడానికి ఇదే కారణమా!

 


కోలీవుడ్‌లో దాదాపు 18 ఏళ్లకు పైగా విజయవంతమైన దర్శకుడిగా కొనసాగుతున్న వెంకట్ ప్రభు, 2007 లో 'చెన్నై 600028' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత అజిత్‌తో 'మంకథ' (2011), దళపతి విజయ్‌తో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (2024) వంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'GOAT' సినిమా తర్వాత ఆయన చేయబోయే 11వ సినిమాపై భారీ అంచనాలు నమోదయ్యాయి.ఆ పదకొండవ చిత్రం ఎవరిదయ్యి ఉంటుందో చూడాలి.


[Venkat Prabhu About Sivakarthikeyan,venkat Prabhu, Sivakarthikeyan Movie Rumors, Venkat Prabhu, Sivakarthikeyan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com