Home

»

Latest News

రవితేజ వీర మే 20 వ తేదీ రిలీజ్

May 5, 2011 12:04PM

రవితేజ "వీర" మే 20 వ తేదీ రిలీజ్ కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, "రైడ్" ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"వీర". రవితేజ "వీర" చిత్రం "మే" నెల 20 వ తేదీన విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

 

 

రవితేజ "వీర" చిత్రంలో కాజల్ కబడ్డి చిట్టిగా మాస్ పాత్రలోనూ, తాప్సి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానూ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ రవితేజ "వీర" చిత్రం ఆడియో ఇటీవల మార్కెట్లోకి డైరెక్టుగా విడుదలయ్యింది. రవితేజ "వీర" చిత్రం షూటింగ్ "మే"14 వ తేదీకల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత మరో రెండు రోజుల్లో సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. రవితేజ "వీర" చిత్రం "మే" నెల 20 వ తేదీన విడుదల చేయటానికి పరిస్థితులు సానుకూలమవుతాయి. ప్రస్తుతం "మే" 10 వ తేదీ నుండి యూరప్ లో హీరో రవితేజ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పైన ఒక యుగళ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com