Home

»

Latest News

ఆ మెగా హీరో కొత్త టైటిల్ ' మిస్టర్ '..?

Mar 29, 2016 12:01PM

భారీ పరాజయాలతో గట్టిగా ఎదురుదెబ్బలు తినడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో హిట్టు సినిమా అత్యంత ఆవశ్యకం వైట్లకే. బ్రూస్ లీ నిరుత్సాహపరిచినా, మెగా క్యాంప్ నుంచి వైట్ల గారికి మళ్లీ అవకాశం రావడంతో, ఈ సారి గురి తప్పకూడదనే ఆలోచనలో శ్రీనుగారున్నారు. వరుణ్ తేజ్ తో మంచి ప్రేమకథను తెరకెక్కించాలనేది శ్రీను ప్లాన్. నిజానికి శ్రీను వైట్లకు ప్రేమ కథలు తీయడమంటే చాలా ఇష్టం. ఆనందం, సొంతం అలాంటి ప్రేమకథల్ని అద్భుతంగా తెరకెక్కించిన వైట్ల ఆ తర్వాత తెలుగు సినిమాల లెక్కల దృస్ట్యా కొత్త ఫార్ములా కనిపెట్టాడు. వరసగా హిట్లు కొట్టాడు. కాకపోతే, మరీ రొటీన్ అయిపోవడంతో ఆగడు తర్వాతి నుంచి వైట్లను ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీంతో తనకు ఇష్టమైన లవ్ ట్రాక్ లోనే వెళ్లటానికి ట్రై చేస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ' మిస్టర్ ' అనే టైటిల్ ను అనుకుంటున్నారట. లావణ్య త్రిపాఠీ, హెబ్బా పటేల్ వరుణ్ తో రొమాన్స్ చేయబోతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8 న ఉగాది నుంచి షూటింగ్ స్టార్ అవుతుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com