మరోసారి వరుణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్!
on Dec 26, 2021

`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` చిత్రాలతో 2019లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే, కరోనా ఎఫెక్ట్ తో 2020, 2021 క్యాలెండర్ ఇయర్స్ కాస్త వరుణ్ కి `జీరో రిలీజ్ ఇయర్స్`గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తాజా చిత్రాలు `గని`, `ఎఫ్ 3` వరుస నెలల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. మార్చి 18న వరుణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా `గని` థియేటర్స్ లోకి రానుండగా.. ఏప్రిల్ 29న హిలేరియస్ ఎంటర్టైనర్ `ఎఫ్ 3` సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇలా రెండు వరుస నెలల్లో వరుణ్ తేజ్ సినిమాలు రిలీజ్ కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఈ కొణిదెల యంగ్ హీరోకి. ఆ వివరాల్లోకి వెళితే.. 2018 క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 21న వరుణ్ నటించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్` రిలీజ్ కాగా.. 2019 సంక్రాంతి కానుకగా జనవరి 12న కామెడీ డ్రామా `ఎఫ్ 2` విడుదలైంది. అంటే.. మూడు వారాల వ్యవధిలో వరుణ్ నుంచి రెండు సినిమాలు వచ్చాయన్నమాట. కాగా `అంతరిక్షం`, `ఎఫ్ 2` తరహాలోనే `గని`, `ఎఫ్ 3` కూడా బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లోనే వస్తున్నప్పటికీ ఈ సారి మాత్రం ఆరు వారాల వ్యవధి ఉండడం గమనార్హం.
మరి.. గత సందర్భంలో `ఎఫ్ 2`తో మాత్రమే సక్సెస్ చూసిన వరుణ్.. ఈ సారి `గని`, `ఎఫ్ 3` ఇలా రెండు చిత్రాలతోనూ హిట్స్ కొడతాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



