Home

»

Latest News

లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే

Aug 20, 2026 10:16AM

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన సోలో విజయం కాబట్టి  కనకరాజు మూడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వరుణ్   మాట్లాడుతు ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకుంటున్నారనే విషయం బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడంటే తన అప్ కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ఉండబోతున్నాడో తెలుస్తుంది.  

వరుణ్ తేజ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే తన సోదరి నీహారిక నిర్మాణ సారధ్యంలో కమిటి కర్రోళ్ళు డైరెక్టర్ తో   'బరి' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన లిస్ట్ లో తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుంది. ఇటీవలే "కొరియన్ కనకరాజు" చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని పూర్తి జోరు మీదున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాల బాటలో వెళ్లకుండా, కథాంశంలో వైవిధ్యం ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే  కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి ఓ విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన మూస ధోరణిలో, రెగ్యులర్ ఎమోషన్స్‌తో సాగుతుంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం దానికి నూటికి నూరు శాతం భిన్నంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రస్తుత వయస్సుకు, మెచ్యూరిటీకి సరిగ్గా సరిపోయే ఒక పరిణతి చెందిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుందని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. ఇది రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, ప్రేక్షకులు అస్సలు ఊహించని కొత్త కోణంలో సాగుతుందని, కథనంలో ఉండే వినూత్న ట్విస్టులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ స్టైల్ మరియు వరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే వెండితెరపై ఒక సరికొత్త మ్యాజిక్ క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read: సీనియర్ నటీమణి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. వెంటిలెటర్ పై చికిత్స

పిజ్జా, జిగర్తండ, పేట, మహాత్మా వంటి సూపర్ హిట్ సినిమాలతో తన మార్క్ చూపించిన కార్తీక్ సుబ్బరాజ్, మొదటి నుంచి డిఫరెంట్ మేకింగ్‌తో ప్రసిద్ధి చెందారు. ఇండియన్ సినిమాలో ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, వెట్రిమారన్ వంటి దిగ్గజ దర్శకుల జాబితాలో కార్తీక్ సుబ్బరాజ్ పేరు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన కథ చెప్పే విధానం, పాత్రల చిత్రణ, విజువల్స్ నిలిపే శైలి ఎంతో ప్రత్యేకం. అలాంటి మైండ్ బ్లోయింగ్ మేకర్, వరుణ్ తేజ్ వంటి వైవిధ్యమైన నటుడితో ఓ లవ్ స్టోరీ చేయడం టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Varun Tej, Karthik Subbaraj, Tollywood

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com