
వరుణ్ తేజ్(Varun Tej).. కట్ అవుట్, గ్లామర్, యాక్టింగ్ అన్ని పుష్కలమైన మోతాదులోనే ఉన్నాయి. కానీ కొంత కాలం నుంచి డిజాస్టర్ అనేది ఆగర్భ శత్రువుగా వరుణ్ తేజ్ చుట్టూ వైఫై లా తిరుగుతూ ఉంది. వరుసగా నాలుగు డిజాస్టర్లు అందుకున్నాడు. (వెంకటేష్ తో కలిసి) ఎఫ్ 3 ముందు చేసిన గని, గాండీవధారి అర్జున, పాన్ ఇండియా మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' , మట్కా' .. ఇలా నాలుగు చిత్రాలు భారీ డిజాస్టర్స్. పెట్టిన బడ్జెట్ కి, వచ్చిన కలెక్షన్స్ ని నక్కకి నాగలోకానికంత తేడా ఉంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టేందుకు వరుణ్ తేజ్ తీసుకున్న ఒకే ఒక్క కొత్త నిర్ణయం 'కోరియన్ కనకరాజు'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఒక ‘ఇండో-కోరియన్ హారర్ కామిడీ’ జానర్‌లో నిర్మిస్తుండటం విశేషం. వరుస సీరియస్, యాక్షన్ సినిమాలతో బోరింగ్ అనిపించిన వరుణ్, ఈసారి అవుట్ అండ్ అవుట్ హ్యూమర్, ఫన్ ఎంటర్‌టైనర్ ఎంచుకోవడం ఆయన కెరీర్‌కు అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాపై పరిశ్రమలో భారీ ఆశలు నెలకొనడానికి ప్రధాన కారణం దీని నిర్మాణ విలువలు మరియు ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణుల కలయిక. ప్రముఖ నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాయి.
Also read: శేఖర్ కమ్ముల భావోద్వేగం.. అభిమానులు శాంతించండి
క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్న స్వరాలు ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన "కమ్‌సాహంనిడా" అనే లిరికల్ పాట ట్రెండింగ్ లో ఉంది. 'కిమ్‌చీకారం' టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాను ఊపేసింది. మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Varun Tej, Korean Kanakaraju, Ritika Nayak, Merlapaka Gandhi






