Home

»

Latest News

Varun Sandesh: 'నా వైఫ్ మిస్సింగ్' అంటున్న హీరో వరుణ్ సందేశ్!

May 11, 2026 3:20PM

వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై ఆహా సమర్పణలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "నా వైఫ్ మిస్సింగ్" (Naa Wife Missing). ఇటీవలే 'నయనం' వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో ఒక చక్కటి ప్రేమ కథగా ఈ చిత్రం రానుంది. 

ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. సతీష్ కుమార్ ఎన్ఎస్ సినిమాటోగ్రఫీ చేయనున్న ఈ చిత్రానికి సాయి బాబు తలారి ఎడిటింగ్ చేస్తున్నారు. ఎన్నో చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఉమర్జీ అనురాధ ఈ చిత్ర కథను అందించగా శ్రీనివాస్ మండల స్క్రీన్ ప్లే రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆదిత్య భార్గవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. 

ఇటీవలే ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభం కావడం జరిగింది. ఆహా బృందం స్క్రిప్ట్ అందించగా సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ మొదటి క్లాప్ కొట్టారు. నటుడు, నిర్మాత, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత నీలకంఠ తొలి షాట్ కు దర్శకత్వం వహించారు. 

కాగా నేటి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్స్, మిస్ అయిన వైఫ్ ఎవరు? అనే విషయాలు చిత్ర బృందం క్రమంగా విడుదల చేయనుంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com