
రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ మహేశ్ బాబు వంటి స్టార్‌తో ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది.
అయితే ఈ సినిమా నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ అభిమానులను ఖుషీ చేస్తోంది. ‘వారణాసి’ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
ఓ అభిమాని సోషల్ మీడియాలో ‘ఇంతకీ అప్‌డేట్ ఉందా లేదా మాస్టారూ?’ అంటూ చిత్రబృందాన్ని ప్రశ్నించారు. దీనికి ‘వారణాసి’ అఫీషియల్ హ్యాండిల్ స్పందిస్తూ.. “షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సీజీ వర్క్స్ నడుస్తున్నాయి. ఆర్ఆర్ కూడా జరుగుతోంది. డబ్బింగ్ ప్రారంభించాలి. ఇది అప్‌డేట్ అనుకుంటే అప్‌డేటే. లేదంటే ఆ బ్లాస్ట్ కోసం ఇంకొంచెం వేచి ఉండాలి” అంటూ సమాధానం ఇచ్చింది.

ఇక చివర్లో చిత్రబృందం ఇచ్చిన ‘బ్లాస్ట్ కోసం వేచి ఉండండి’ అనే హింట్ ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అది కొత్త గ్లింప్సా? టీజరా? లేక మరో భారీ ప్రమోషనల్ ఈవెంటా? ఏడాది పాటు పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వని రాజమౌళి టీమ్ ఇప్పుడు ఏ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందో అనే ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇది కూడా చదవండి: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. వారణాసి తర్వాత నెక్స్ట్ మూవీ ఇదేనా.?
టైమ్ ట్రావెల్, మైథలాజికల్, అడ్వెంచర్ అంశాలతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సాగే కథగా ‘వారణాసి’ సినిమాని రూపొందిస్తున్నారు. ఇలాంటి భారీ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకం. అందుకే రాజమౌళి ప్రతి ఫ్రేమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహేశ్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామాయణం నేపథ్యంతో ఉండబోయే ప్రత్యేక ఎపిసోడ్‌లో మహేశ్ బాబు శ్రీరాముడిగా కనిపించనుండటం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చవచ్చు:
బన్నీ-బోయపాటి కాంబో.. ఈసారి మాస్ కాదు.. మైథలాజికల్.!
కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్.!
[Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Prithviraj Sukumaran]






