వంగవీటిలో ఆ సన్నివేశాలు తొలగించండి
on Dec 24, 2016
బెజవాడ రౌడీ రాజకీయాలు, దివంగత వంగవీటి మోహన రంగా జీవితకథ ప్రధాన ఇతివృత్తంగా సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను చూసిన ప్రేక్షకులు కొందరు దీనిపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా వంగవీటి మోహనరంగా చరిత్రను వక్రీకరించారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు కాపు సామాజిక వర్గ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ రంగా అభిమానులు, కాపు నాయకులు రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. నిన్న ఇదే విషయంపై రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిసి ఫిర్యాదు చేశారు.