అమితాబ్-దాసరి రియల్ ఎస్టేట్ బిజినెస్..!
on Dec 21, 2016
అవును బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో దాసరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక్కడ దాసరి అంటే దర్శకరత్న దాసరినారాయణరావు కాదు..నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. అసలు మ్యాటర్‌లోకి వెళితే దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా జీవితచరిత్రతో తెరకెక్కిస్తున్నవంగవీటి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దాసరి కిరణ్‌కుమార్. ఈయనకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. ఇప్పటికే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.
దీనిలో భాగంగా దేశ ఆర్థిక రాజధానిలో జెండా పాతాలని డిసైడ్ అయ్యారు..అక్కడ తనకు అంతగా పలుకుబడి లేకపోవడంతో దానిని పెంచుకునే ప్రయత్నాలు మొదలెట్టారు..ఆ ప్లాన్‌ను ఆచరణలో పెట్టిన కిరణ్ సర్మార్-3కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..దీని వల్ల ఆయనకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో పరిచయం ఏర్పడింది..ఇప్పుడు ఆయనతో కలిసి ముంబైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశాడట కిరణ్..అసలు దీనింతటికి కీలక సూత్రధారి ఎవరో తెలుసా..రామ్‌గోపాల్ వర్మ. వంగవీటికి, సర్కార్-3కి ఆయనే దర్శకత్వం వహిస్తుండటంతో దాసరిని అమితాబ్‌కి పరిచయం చేశాడట వర్మ. మొత్తానికి రాము పుణ్యమా అని నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు దాసరి.