Home

»

Latest News

Vanda Devullu: వంద దేవుళ్ళు ఫస్ట్ రివ్యూ ఇదే

Jun 18, 2026 2:11PM

 


తెలుగు, తమిళ నాట ఒకే అదరణని సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని(Vijay Antony)రేపు వంద దేవుళ్ళు(Vanda Devullu)చిత్రంతో ల్యాండ్ కానున్నాడు. ఈ రోజు కొన్ని ఏరియాస్ లో ప్రీమియర్స్ కూడా ప్రదర్శిస్తున్నారు. శశి(Sasi)దర్శకుడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'బిచ్చగాడు' ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్ పునరావృతం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 2 గంటల 11 నిమిషాల నిడివితో తెరకెక్కగా  ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా కథాంశం ఒక సంప్రదాయబద్ధమైన గ్రామంలో నివసించే సెల్వి అనే ఒక వితంతువు చుట్టూ తిరుగుతుంది. భర్తను కోల్పోయిన తర్వాత తన ఇద్దరు కొడుకులని ప్రయోజకులని చేయడానికి ఆమె తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేస్తుంది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె జీవితంలో అనుకోని మలుపు ఎదురవుతుంది. సమాజం, సంప్రదాయాలు నిర్దేశించిన గీతలను దాటి, తన స్వంత సంతోషం కోసం ఆమె ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒక పక్క సమాజం, మరోపక్క ప్రాణంగా పెంచిన కుటుంబం ఆమె తీసుకునే మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక తల్లి, వితంతువు అయిన స్త్రీ సమాజ అంచనాలను అందుకుందా లేదా తన ఆత్మసంతృప్తిని ఎంచుకుందా అనే భావోద్వేగాల సమాహారమే ఈ 'వంద దేవుళ్ళు'.

నటీనటుల విషయానికి వస్తే, విజయ్ ఆంటోని మరోసారి మెస్మరైజ్ చేసాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్‌లో ఆయన నటన 100 శాతం ప్రేక్షకులను కదిలిస్తుంది. స్వాసిక విజయ్, లిజోమోల్ జోస్, అజయ్ ధిషన్, కరుణాస్ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. దర్శకుడు శశి మనుషుల మధ్య ఉండే బంధాలను, ముఖ్యంగా తల్లి ప్రేమను మరియు సమాజంలోని పితృస్వామ్య పోకడలని  చాలా సహజంగా తెరకెక్కించారు. బాలాజీ శ్రీరామ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషనల్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలు పండటంలో రీ-రికార్డింగ్ ముఖ్య పాత్ర పోషించింది.

Also read: Samantha: ఆ స్టార్ హీరో చేయిపెడితే 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

మొత్తంగా చూసుకుంటే, 'వంద దేవుళ్ళు' కేవలం ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఇది సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన ఒక సున్నితమైన సామాజిక అంశాన్ని స్పృశించింది. ఫస్ట్ రివ్యూల ప్రకారం ఈ చిత్రానికి 5 కి 3.5 రేటింగ్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక హృదయపూర్వకమైన చిత్రం ఇదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిచ్చగాడు సెంటిమెంట్‌ ఇష్టపడే ప్రేక్షకులకి ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com