Home

»

Latest News

వదల ట్రైలర్ రివ్యూ.. పెళ్లయిన మగాడిపై యువతి కన్ను.. బాబోయ్ సైకో ప్రేమ.!

Jul 9, 2026 5:45PM

జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వదల’. కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కంప్లీట్ సస్పెన్స్, ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడి ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

ట్రైలర్ ప్రారంభంలో జగపతి బాబు (యోగి), లయల మధ్య జరిగే ఒక రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ కన్వర్జేషన్‌తో కథ మొదలవుతుంది. పెళ్లై 20 ఏళ్లు దాటినా, ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా భార్యతో యోగి చేసే ఫ్లర్టింగ్, వారి మధ్య ఉండే కెమిస్ట్రీ ఒక అందమైన ఫ్యామిలీ డ్రామాను తలపిస్తుంది. కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలితో కూడిన ఒక హ్యాపీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ను చూపిస్తూనే కథలోకి ఒక అనోన్ నంబర్ నుండి వచ్చే హరాస్‌మెంట్ మెసేజెస్ రూపంలో అసలు ట్విస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. యోగి కుటుంబంలోకి రితికా శ్రీనివాస్ పాత్ర ప్రవేశించిన తర్వాత కథ మొత్తం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. "నా యోగి నాకు కావాలి, ఎవరు అడ్డుపడినా యోగిని పట్టుకుపోతాను" అంటూ ఆమె చెప్పే డైలాగ్స్, సైకో తరహా ప్రవర్తన సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేశాయి.

సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా కనిపిస్తోంది. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు అందించిన విజువల్స్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. అలాగే కార్తీక్ బి. కొడకండ్ల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ను, సస్పెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చాలా షార్ప్‌గా ఉంది. 

ఒక హ్యాపీ ఫ్యామిలీలోకి వచ్చిన ఒక అపరిచిత యువతి ఆ కుటుంబాన్ని ఎలా అతలాకుతలం చేసింది, యోగి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

 

Vadala Trailer, Jagapathi Babu, Laya, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com