Home

»

Latest News

అగ్ర హీరోకి 5 కోట్ల బెదిరింపు కాల్: చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు! 

Nov 3, 2026 3:36PM


ఒకప్పటి బాలీవుడ్ అగ్ర నటుడు జితేంద్ర గురించి తెలియని సినీ ప్రేమికులు లేరు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి వచ్చిన కొన్ని సినిమాలని జితేంద్ర హిందీలో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. అయన కుమారుడు  తుషార్ కపూర్ కూడా తండ్రి దారిలోనే సినీ కళామ తల్లి నా అడ్డా అంటూ దూసుకుపోతున్నాడు.


రీసెంట్ గా తుషార్ కపూర్‌కి  5 కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ ఒక బెదిరింపు కాల్ వచ్చింది. తనని తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకున్న హారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ హఠాత్పరిణామంతో ఒక్కసారిగా బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేగింది. ఈ బెదిరింపుల పట్ల అప్రమత్తమైన నటుడు వెంటనే ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధిత నటుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు మరియు యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తీవ్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్న పోలీసులకు కొన్ని కీలకమైన సాంకేతిక ఆధారాలు లభించాయి. నిందితుడు పంపిన ఆడియో రికార్డింగ్‌లని గతంలో నమోదైన అసలైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల వాయిస్ సాంపుల్స్‌తో పోలీసులు సరిపోల్చి చూశారు. ఈ పోలికలో ఆడియోల మధ్య స్పష్టమైన తేడాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.


ఇది కూడా చదవండి: సినిమాల్లో కాన్పు దశాబ్దాల మార్పు: ప్రసవ ఘట్టాల వెనుక దాగున్న అసలు కథ!

 


  

వాయిస్ మ్యాచ్ కాకపోవడంతో, ఇది అసలు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా లేక ఎవరైనా ఆ గ్యాంగ్ పేరును అడ్డుపెట్టుకుని భయపెట్టాలని చూస్తున్న నకిలీ కాల్‌ నా  అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక విచారణలో భాగంగా, ఎవరో గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తి ఉద్దేశపూర్వకంగా లారెన్స్ బిష్ణోయ్ పేరును వాడుకుని భయభ్రాంతులకు గురిచేసి డబ్బు వసూలు చేయాలని చూస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

 

[Tusshar Kapoor Extortion Threat, Tusshar Kapoor, Lawrence Bishnoi gang, Mumbai Police, Bollywood news, extortion threat, Rs 5 crore demand, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com