Home

»

Latest News

'జననాయకుడు' ని త్రిష ఏ థియేటర్ లో చూసిందంటే.. అక్కడే ఎందుకు!

Jul 23, 2026 4:08PM

 


ఇళయ దళపతి విజయ్(VIjay)తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి థియేటర్స్ లో 'జన నాయగన్'(తెలుగు జననాయకుడు)తో సందడి చేస్తున్నాడు. సెన్సార్ వివాదాల తలెత్తిన 
ఏడూ నెలల తర్వాత రిలీజ్ అవ్వడంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. 

 విజయ్‌తో పలు హిట్ చిత్రాల్లో జత కట్టిన  స్టార్ హీరోయిన్ త్రిష(Trisha)చెన్నైలోని ప్రసిద్ధ రోహిణి థియేటర్‌కి జన నాయగన్ చూడటానికి వచ్చింది. వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఎంతో సింపుల్‌గా థియేటర్‌లోకి అడుగుపెట్టిన త్రిషని  చూసి అక్కడున్న వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా ఈలలు, కేరింతలతో థియేటర్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. నటుడిగా విజయ్ చివరి సినిమాని మొదటి రోజే బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు త్రిష స్వయంగా రావడం వారిద్దరి మధ్య ఉన్న అపారమైన స్నేహ బంధానికి, పరస్పర గౌరవానికి అద్దం పడుతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన  వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికల్లో క్ష వైరల్‌గా మారాయి.

Also read: జననాయకుడులో ప్రకాష్ రాజ్ రోల్.. ఆ పొలిటికల్ లీడర్‌దేనా?

విజయ్, త్రిష మధ్య ఉన్న అనుబంధం గురించి ఆ ఇద్దరు ఇంతవరకు ఓపెన్ గా చెప్పింది లేదు. కానీ సోషల్ మీడియాలో ఆ ఇద్దరి బంధంపై పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. విజయ్ భార్య సైతం విజయ్ ఒక హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని చెప్పినప్పడు త్రిష పేరు వినపడింది. ఆ వెంటనే త్రిష, విజయ్ కలిసి ఒక ఫంక్షన్ కి కూడా హాజరయ్యారు. త్రిష మాత్రం ఇటీవల మాట్లాడుతూ 'నచ్చిన వ్యక్తి కనపడగానే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

vijay, trisha, jana nayaganm rohini theater, h vinoth

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com