
సుదీర్ఘ కాలం నుంచి త్రిష తమిళ, తెలుగు భాషల్లో తన సత్తా చాటుతు వస్తుంది. అయితే, సినీ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నా త్రిష వ్యక్తిగత జీవితం, పెళ్లికి సంబంధించిన విషయాలు నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. గతంలో ఒకసారి నిశ్చితార్థం జరిగి క్యాన్సిల్ అవ్వడం, ఆ తర్వాతవిజయ్ తో ముడిపెడుతూ వస్తున్న రూమర్లు త్రిష ని తరచూ హాట్ టాపిక్‌గా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెళ్లి, బంధాలు, విడాకులపై త్రిష చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి అనే బంధంపై ఆమెకున్న స్పష్టమైన అభిప్రాయాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
రీసెంట్ గా త్రిష ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'కేవలం సమాజం కోసం లేదా వయసు అయిపోతుందనే కారణంతో నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నాకు నచ్చడంతో పాటు , నన్ను పూర్తిగా అర్థం చేసుకునే సరైన తోడు దొరికితేనే పెళ్లి పీటలు ఎక్కుతాను. ఒకవేళ అలాంటి వ్యక్తి జీవితంలో ఎదురవకపోతే జీవితాంతం 100 శాతం ఒంటరిగా ఉండిపోవడానికైనా సిద్ధమే. నాకు జీవితాన్ని పంచుకునే ఒక మంచి కంపానియన్ కావాలి. కేవలం పెళ్లి అనే ముద్ర కోసం ఇష్టం లేని వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేను.
Also read: Salman Khan: పర్మినెంట్ గా ఇల్లు ఖాళీ చేస్తున్న సల్మాన్.. ఆ ఒక్కడే కారణమా!
ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ బంధం జీవితాంతం నిలవాలి. మధ్యలోనే విడిపోయే పరిస్థితి రాకూడదు. అందుకే వివాహం చేసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాను. తొందరపడి ఏ అడుగు వేయను. నా చుట్టూ ఉన్న స్నేహితులు, తెలిసిన వారిలో చాలా మంది కేవలం సమాజం కోసమో, వేరే ఇతర తప్పుడు కారణాల వల్లో పెళ్లిళ్లు చేసుకుని, ఆ తర్వాత సర్దుకుపోలేక నరకం అనుభవిస్తున్నారు. ఇష్టం లేని వివాహ బంధంలో ఉంటూ ప్రతిరోజూ బాధపడటం కంటే, గౌరవంగా ఒంటరిగా జీవించడమే ఎంతో ఉత్తమమనేది తన అభిప్రాయమని త్రిష చెప్పుకొచ్చింది.





.webp)
