ENGLISH | TELUGU  

ఇంటి నుంచి బయటకి రమ్మన్న వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. నెక్స్ట్ జరిగేది ఇదేనా!

on Feb 16, 2026


  


-ఇన్ స్టాగ్రామ్ వేదికగా త్రిష పోస్ట్ 
-ముందు ముందు ఏం జరగబోతుంది 
-ఫ్యాన్స్ ఏమంటున్నారు


హీరో, హీరోయిన్ కే కాదు. సదరు హీరో, హీరోయిన్ కాంబో కి కూడా డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఒక కాంబోనే  ఇళయ దళపతి విజయ్(Vijay),స్టార్ హీరోయిన్ త్రిష(Trisha).ఈ ఇద్దరు స్క్రీన్ పై కనపడితే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కలెక్షన్స్ వర్షం కురవడమే కాదు తమిళ సినీ మార్కెట్ కి సరికొత్త సవాళ్లు విసురుతాయి. అంతటి చరిష్మా ఆ ఇద్దరి కాంబో సొంతం.

 

రీసెంట్ గా తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్(Nainar Nagendran)రాజకీయ విమర్శల్లో భాగంగా విజయ్ ని ఉద్దేశించి మాట్లాడుతు విజయ్ ని త్రిష ఇంట్లో నుంచి బయటకు రమ్మనండి. ఆమెతో ఉన్న అనుబంధం నుంచి తప్పుకుంటేనే తన చుట్టూ ఏం జరుగుతుందో విజయ్‌కి తెలుస్తుంది. వాస్తవ ప్రపంచాన్ని చూడగలడు. విజయ్‌ కి ఉన్న రాజకీయ అనుభవం శూన్యం. ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి ముందు తన కుటుంబంలోని సంబంధాలను సరిదిద్దుకోవాలనే సంచలన కామెంట్స్ చేసాడు. ఈ విషయంపై  త్రిష స్పందిస్తూ 'ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడని ఊహించలేదు. నా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో కలపద్దు. రాజకీయాలకి నేను దూరం. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తు  ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.

 

also read:  మరో నాలుగు రోజుల్లో రిలీజ్..  సినిమా టైటిల్ మారింది


ఈ నేపథ్యంలో ముందు ముందు సదరు విషయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. విజయ్ ఇప్పటి వరకు ఈ విషయంపై మాట్లాడలేదు. అభిమానులు మాత్రం నైనార్ నాగేంద్ర పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.త్రిష, విజయ్ లు కలిసి  గిల్లి,ఆతి, తిరుప్పాచ్చి ,కురువి ,లియో వంటి చిత్రాల్లో చేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' ద్వారా విజయ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.

 

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.