
పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న యష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యష్ వన్ మాన్ షో టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది. రావడమే కాదు సుమారు నాలుగు నిమిషాల ముప్పై సెకన్ల ఉన్న ట్రైలర్ పాన్ ఇండియా మొత్తాన్ని దుమ్ము రేపుతోంది.
ట్రైలర్ ప్రారంభం నుంచే తీవ్రమైన హింస, రక్తపాతం, యాక్షన్ దృశ్యాలతో మైండ్ బ్లాక్ అయ్యే వాతావరణాన్ని సృష్టిస్తుంది. యష్ ఈ చిత్రంలో 'రాయా' అనే శక్తివంతమైన ఆంటి-హీరో పాత్రతో పాటు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తుండటం ట్రైలర్‌లోని అతిపెద్ద విజువల్ హైలైట్. గోవా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్ మాఫియా ప్రపంచంలో యష్ పాత్ర విశ్వరూపం చూపిస్తోంది. దీనికి తోడు రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కి ప్రాణం పోశాయి. ప్రతి షాట్ కూడా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించేలా అద్భుతమైన సినిమాటోగ్రఫీతో తీర్చిదిద్దబడింది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్స్ ముఖ్యమైన రోల్స్ పోషిస్తున్నట్టుగా అర్ధమవుతుంది. ఆ అందరి లుక్స్, విజువల్ ప్రెజెన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
Also read: ఆ బ్యానర్ లోనే ఎందుకు: త్రివిక్రమ్ అన్ని సినిమాలు
ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ యూట్యూబ్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించగా, ఈ ట్రైలర్ ఆ రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతోంది. యష్ మార్క్ ఎలివేషన్లు మరియు గీతూ మోహన్‌దాస్ టేకింగ్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా రేంజ్‌ను దాటి గ్లోబల్ లెవెల్‌లో నిలబెట్టబోతున్నాయనే విషయం కూడా క్లియర్ గా అర్ధమవుతుంది. మొత్తంగా చూస్తే, 'టాక్సిక్' ట్రైలర్ కేవలం ఒక మాస్ విందు మాత్రమే కాకుండా ఒక క్లాసిక్ డార్క్ థ్రిల్లర్ అనుభవాన్ని అందిస్తుందని స్పష్టమవుతోంది. ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగానికి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అగస్ట్ నెలని సినీ సునామి నెలగా మార్చే అవకాశాలు ఉన్నాయి.
Toxic, yash, Kaira Adwani, Nayanthara





.webp)
