Home

»

Latest News

టాక్సిక్‌ డైరెక్టర్ గీతు మోహ‌న్‌దాస్ తెలుగులో హీరోయిన్‌గా చేసింద‌ని మీకు తెలుసా?

Feb 27, 2026

- ఆమె చేసిన తెలుగు సినిమా ఏమిటి? ఎవ‌రి డైరెక్ష‌న్‌లో చేసింది?

- య‌శ్ వంటి స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీ చేసే ఛాన్స్ ఆమెకు ఎలా వ‌చ్చింది?

- అస‌లు ఎవ‌రీ గీతు మోహ‌న్‌దాస్‌?

‘కెజిఎఫ్‌’ సిరీస్‌తో వయొలెంట్ యాక్షన్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యశ్.. ఇండియాలోని టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఆ సినిమా తర్వాత యశ్ లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్‌తో సినిమా చేయబోతున్నాడు అనగానే అందరూ షాక్ అయ్యారు. యశ్ లాంటి యాక్షన్ హీరోని డీల్ చెయ్యడం ఒక లేడీ డైరెక్టర్ వల్ల అవుతుందా అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఆ సందేహాల మధ్యే ‘టాక్సిక్‌’(Toxic) పేరుతో సినిమా స్టార్ట్ అయింది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 

టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. కెజిఎఫ్‌లోనే హీరో ఎలివేషన్ ఒక రేంజ్‌లో ఉంది. అలాగే వయొలెన్స్ మోతాదు కూడా ఆ సినిమాలో ఎక్కువ. ఇప్ప్పుడు ‘టాక్సిక్‌’ టీజర్ చూసిన తర్వాత ‘కెజిఎఫ్‌’ని మించి ఈ సినిమాలో అలాంటి సీన్స్ ఉన్నాయనేది అర్థమవుతోంది. సినిమా నెక్స్‌ట్ లెవల్‌లో ఉండబోతోందనేది తెలుస్తోంది. అయితే ఒక లేడీ డైరెక్ట్ చేసిన సినిమాలో ఇంత వ‌యొలెన్స్‌ని ఎవ‌రూ ఎక్స్‌పెక్ట్ చెయ్య‌లేదు. అందుకే అస‌లు ఎవ‌రీ గీతు మోహ‌న్‌దాస్ అని ఆరా తియ్య‌డం మొద‌లు పెట్టారు నెటిజ‌న్లు. ఆమె గురించి చాలా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలీకపోయినా తమిళ, మలయాళ, హిందీ  ప్రేక్షకులకు ఈ పేరు సుప‌రిచిత‌మే.

1986లో ఐదేళ్ళ వయసులోనే  బాలనటిగా మలయాళ సినిమా ద్వారా పరిచయమైన గీతు.. ఆ తర్వాత పలు మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గానూ, కీలక పాత్రల్లోనూ కనిపించింది. విశేషమేమిటంటే.. తెలుగులో కూడా గీతు ఒక సినిమా చేసింది. 2001లో వేణు హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ రూపొందించిన ‘వీడెక్కడి మొగుడండీ’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. 2009 వరకు పలు చిత్రాల్లో నటించిన గీతు నటనకు గుడ్‌బై చెప్పి అదే సంవత్సరం సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవిని వివాహం చేసుకున్నారు. 

2009లోనే ఒక షార్ట్ ఫిలిం ద్వారా డైరెక్షన్‌లోకి దిగారు గీతు. 2014లో ‘లైయర్స్ డైస్‌’ అనే హిందీ సినిమా ద్వారా మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డులతోపాటు పలు పురస్కారాలు లభించాయి. 2019లో నివిన్ పాలీ హీరోగా మలయాళ, హిందీ భాషల్లో ‘ముతూన్‌’ చిత్రం చేశారు. ఈ సినిమాకి కూడా కేరళ స్టేట్ అవార్డులతోపాటు ఇతర అవార్డులు కూడా లభించాయి. ‘టాక్సిక్‌’ గీతు డైరెక్ట్ చేస్తున్న మూడో సినిమా. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో క‌న్న‌డ‌, ఇంగ్లీష్ భాష‌ల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి యశ్ కూడా నిర్మాత కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే.. గీతు మోహన్‌దాస్ డైరెక్ట్ చేసే ప్రతి సినిమాకీ ఆమె భర్త రాజీవ్ రవి ఛాయాగ్ర‌హ‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com