Home

»

Latest News

Toxic: టాక్సిక్ కి కొత్త తలనొప్పి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్ర అటవీ శాఖ

Feb 10, 2026 4:56PM

 

 

-అభిమానుల్లో టాక్సిక్ టెన్షన్ 
-రిలీజ్ డేట్ ఆగదు కాదా 
-టాక్సిక్ యూనిట్ చేసిన నేరం ఏంటి
-అసలు ఏం జరుగుతుంది

 

'టాక్సిక్'(Toxic)ద్వారా మరోసారి వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు యష్. కేజిఎఫ్ సిరీస్ సక్సెస్ తర్వాత ఆ సిరీస్ ఇచ్చిన కిక్ ని మించిన కిక్ అభిమానులని  ఇవ్వాలని యష్ కోరిక. అందుకే చాలా గ్యాప్ తీసుకొని ఏరి కోరి టాక్సిక్ ని ఎంచుకున్నాడు. దీన్ని బట్టి టాక్సిక్ పై యష్ కి ఉన్న నమ్మకాన్ని అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు కూడా అదే నమ్మకంతో రిలీజ్ డేట్  మార్చి 19 కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాంటి టాక్సిక్ ముందు వరుస వివాదాలు కవచ కుండలాలుగా అంటి పెట్టుకుంటున్నాయి. ఆ  కోవలోనే  రీసెంట్ గా  టాక్సిక్ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


టాక్సిక్ షూటింగ్ బెంగళూరులోని పీణ్య, జలహళ్లి దగ్గరలోని సమీప అటవీ ప్రాంతంలో కూడా జరిగింది. ఇక్కడ షూటింగ్ జరిగిన అన్నిరోజులు చిత్ర యూనిట్ ఎలాంటి అనుమతి లేకుండా వేలాది చెట్లని నరికేశారని కర్ణాటక అటవీ శాఖ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సదరు ఎఫ్ఐఆర్ లో షూటింగ్ యూనిట్‌తో పాటు భూమిని లీజుకి ఇచ్చిన వారిపైనా కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం.ఈ విషయంపై అటవీ శాఖ మంత్రి స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి సోషల్ మీడియాలో పిక్స్ ని పోస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

also read:  Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 


ఆల్రెడీ టాక్సిక్ టీజర్ అంశం వివాదాలలో ఉంది. ఇప్పుడు చెట్లని కూడా నరికివేసారనే ఆరోపణలు రావడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు సినిమా రిలీజ్ కి ఇలాంటి విషయాల వలన ఆటంకం ఎదురుకాకుండా చూసుకోవాలని మేకర్స్, యష్ ని కోరుతున్నారు. టాక్సిక్ అయితే డార్క్, ఇంటెన్స్ టోన్‌తో  అంతర్జాతీయ ప్రమాణాలతో మహిళా దర్శకురాలు  గీతు మోహన్‌దాస్(Geetu MOhandas)తెరకెక్కించింది. టెక్నీకల్ గా కూడా కొత్త అనుభూతిని కలిగించబోతుంది. ఈ విషయాన్నీ మేకర్స్ పదే పదే చెప్తున్నారు. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు  అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. కియారా అద్వానీ(Kaira Advani),నయనతార(Nayanthara),రుక్మిణి వసంత్(Rukmini Vasanth),తార సుతారియా,టోమినో థామస్, హుమా ఖురేషి ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు.



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com