టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ
on Jun 3, 2025
మూవీ: టూరిస్ట్ ఫ్యామిలీ
నటీనటులు: ఎమ్.శశి కుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేశ్ తదితరులు
ఎడిటింగ్: భరత్ విక్రమన్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
మ్యూజిక్: సీన్ రోల్డన్
నిర్మాతలు: నజిరత్ పసీలియన్, ముగేశ్ రాజ్ పసీలియన్
రచన, దర్శకత్వం: అభిషన్ జీవింత్
ఓటీటీ: జియో హాట్ స్టార్
కథ:
ధర్మదాస్ (శశికుమార్) వాసంతి (సిమ్రాన్) భార్యాభర్తలు. వారి సంతానమే నీతూ షాన్( మిథున్) మురళి (కమలేశ్). ఈ ఫ్యామిలీ శ్రీలంక నుంచి భారత్ కి అక్రమంగా వస్తుంది. ఒక పోలీస్ టీమ్ కి దొరికిపోయినా, తెలివిగా తప్పించుకుంటారు. వాసంతి అన్నయ్య ప్రకాశ్ (యోగిబాబు) వాళ్లు ఇక్కడ ఉండటానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తాడు. తాము శ్రీలంక నుంచి వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. కేరళ నుంచి వచ్చినట్టుగా అందరికి చెప్తారు. ఎవరితోనూ ఎక్కువగా పరిచయాలు పెంచుకోవద్దని ప్రకాశ్ చెప్పిన మాటలను వాళ్లెవరూ పట్టించుకోరు. ఇదిలా ఉండగా సిటీలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్, పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. అక్రమంగా చొరబడిన శరణార్థులే అందుకు కారణమని వాళ్లు భావిస్తారు. ఆ దిశగా వాళ్లు సెర్చ్ చేస్తూ ఉంటారు. సిటీలోకి ప్రవేశిస్తూ తనకి దొరికిపోయిన ధర్మదాస్ ఫ్యామిలీపై ఆ పోలీస్ కి అనుమానం వస్తుంది. దాంతో ఆ విషయాన్ని పై అధికారికి చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ.
విశ్లేషణ:
కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వస్తాయి. అందరికి నచ్చేస్తాయి. అలాంటివి చాలా అరుదుగా వస్తాయి. సంవత్సరం క్రితం వచ్చిన '90s' , రీసెంట్ గా వచ్చిన 'అనగనగా' ఇలా కొన్ని మాత్రమే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఈ టూరిస్ట్ ఫ్యామిలీ చేరింది.
కథలో ప్రధానంగా కనపడేది అరడజన్ పాత్రలు మాత్రమే కానీ సినిమా అంతా ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరి పాత్ర చిన్నదిగానో పెద్దదిగానో అనిపించదు. ఎందుకంటే ఇది మన చుట్టుపక్కల ఉండే వారి జీవనశైలిలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు మన వీధిలో ఉండేవాళ్ళని చూసిన ఫీల్ కలుగుతుంది. శ్రీలంక నుండి వచ్చిన ఓ కుటుంబం ఎలా సర్వైవ్ అయ్యారనే చిన్న పాయింట్ తో కథని ముందుకు తీసుకెళ్ళాడు దర్శకుడు. అయితే ఆ పాయింట్ తో పాటు మన చుట్టూ ఉండే వారితో మనం బాగుంటే.. వారు మనల్ని ఎంతలా అభిమానిస్తారో కూడా ఈ కథ చెప్తుంది.
ఒక కుటుంబం కోసం ఓ వీధి అంతా కలిసి సపోర్ట్ చేయడం.. వారికి తోడుగా ఉండటం చూస్తుంటే.. అరెరె ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులున్నారా.. ఇలాంటి అభిమానం ఉంటుందా అనే భావన కలుగుతుంది. ఈ సినిమాలో ఓ నాన్న, ఓ అమ్మ, పెద్ద కొడుకు, చిన్న కొడుకు.. ఇలా అందరి ఎమోషన్స్ ని సమపాళ్ళలో చూపించాడు దర్శకుడు.
సినిమా నిడివి రెండు గంటలే కాబట్టి హ్యాపీగా చూసేయొచ్చు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. ఎక్కడ అసభ్య పదజాలం వాడలేదు.. చివరి వరకు ఎంగేజింగ్ గా సాగే ఈ ఫ్యామిలీ డ్రామా విత్ సర్వైవింగ్ థ్రిల్లర్ ని హ్యాపీగా చూసేయొచ్చు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. సీన్ రోల్డన్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ధర్మదాస్ గా శశికుమార్, వాసంతిగా సిమ్రాన్, నీతూ షాన్ గా మిథున్, మురళిగా కమలేశ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ప్రకాశ్ గా యోగిబాబు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.
రేటింగ్: 3 /5
ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే కథ ఇది. డోంట్ మిస్ .
✍️. దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
