Home

»

Latest News

'స్పైడర్‌ మ్యాన్‌' వెడ్డింగ్.. అవెంజర్స్ చేసిన పెళ్లి పనులు చూస్తే నవ్వు ఆగదు.!

Aug 5, 2026 4:19PM

ఇటీవల థియేటర్లలోకి వచ్చిన హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్ తమ అభిమాన సూపర్‌హీరో సినిమాను తమదైన శైలిలో ఓన్ చేసుకుని సోషల్ మీడియాలో రకరకాల వీడియోలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా AIని ఉపయోగించి క్రియేట్ చేసిన ఒక స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

ఇప్పటికే స్పైడర్‌మ్యాన్ స్టార్స్ టామ్ హాలెండ్, జెండయా, సాడీ సింక్‌లపై తెలుగు ఫ్యాన్స్ క్రియేట్ చేసిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా తమిళ అభిమానులు ఒక అడుగు ముందుకేసి పెళ్ళి వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

ఆ వైరల్ ఏఐ వీడియోలో ఏముందంటే.. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ క్యూట్ కపుల్‌గా పాపులర్ అయిన టామ్ హాలెండ్, జెండయాలకు తమిళ సాంప్రదాయ పద్ధతిలో గ్రాండ్‌గా పెళ్లి జరిపించేశారు. పట్టువస్త్రాలు, మల్లెపూలతో పెళ్లిపీటలపై కూర్చున్న ఈ జంట ఒకెత్తయితే, ఈ పెళ్లికి హాజరైన గెస్ట్‌లను చూసి అందరి మైండ్ బ్లాక్ అవుతోంది.

మార్వెల్ సూపర్ హీరోస్, అవెంజర్స్ టీమ్ అంతా ఈ పెళ్లికి హాజరవ్వడమే కాకుండా.. దగ్గరుండి పెళ్లి పనులు చేయడం, వంట పనులు చూసుకోవడం ఆ వీడియోలో చూపించారు. కొందరు వంటలు చేస్తుంటే.. మరికొందరు సూపర్‌హీరోలు భోజనాలు వడ్డిస్తున్నట్లు ఏఐతో క్రియేట్ చేసిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

 

 

Spider Man, Wedding, AI Video, Tom Holland, Zendaya

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com