Home

»

Latest News

Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్‌లో ఈరోజు హెడ్ లైన్స్..

May 05, 2026

1. 'విశ్వంభర' నుంచి కీరవాణి అవుట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' టీమ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం 'హనుమాన్' ఫేమ్ హరి గౌరను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హరి గౌర తన పనిని ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

2. NBK112 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న 'NBK112' మ్యూజిక్ డైరెక్టర్‌ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఆయన రేసులో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌లలో ఒకరిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.

3. 'ఫౌజీ' చిత్ర యూనిట్ లో ఒకరు మృతి
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్ర యూనిట్ కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

4. 'RC17' షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ 
రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'RC17' మూవీ షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఇటీవల 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తి చేసిన చరణ్.. త్వరలోనే  'RC17' షూటింగ్ మొదలుపెట్టనున్నారు. జూన్ 25 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

5. ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ అప్డేట్
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. పార్ట్-1 లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం మరో 40 రోజుల సమయాన్ని కేటాయించిందని సమాచారం. యాక్షన్ పార్ట్ ముగిసిన వెంటనే.. సాంగ్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆపై టాకీ పోర్షన్ తో షూటింగ్ ను ముగించనున్నారు. 

6. సాయిపల్లవి వల్ల 'కల్కి 2' షూటింగ్ కు బ్రేక్
'కల్కి 2' సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్‌లో సోమవారం ప్రారంభం కావాల్సిన 'కల్కి 2' కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. సాయి పల్లవి అనారోగ్యం కారణంగా ఈ షూటింగ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కాగా, దీపికా పదుకొణె స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చినట్లు సమాచారం.

7. డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు విరాళం
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన 'డైరెక్టర్స్‌ డే 2026' వేడుకలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 

8. 20 రోజులకే ఓటీటీలోకి 'పాపం ప్రతాప్' 
తిరువీర్ నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ కామెడీ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, IMDBలో 7.8 రేటింగ్ సాధించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.

9. ప్రముఖ నటుడు కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

10. ఆస్కార్ రేంజ్ విజువల్స్ తో 'ది ఒడిస్సీ' ట్రైలర్!
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మూవీ 'ది ఒడిస్సీ' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు 'ఒడిస్సియస్' తన ఇంటికి చేరుకోవడానికి సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపించింది. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవుల మధ్య సాగే పోరాటాలు ప్రేక్షకులకు ఆస్కార్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com