
'వారణాసి' షూటింగ్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా?
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి' సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నీటి కొరత కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. భారీ వాటర్ అవసరాల నేపథ్యంలో సమస్య తలెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా ప్లాన్ మార్చారా? అన్న చర్చ సాగుతోంది.
ముంబైలో పెద్ది హంగామా!
పెద్ది ట్రైలర్‌ను ఈ నెల 18న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్‌లో పాల్గొననుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది.
ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ టైమ్ ఫిక్స్!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్' నుండి సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టైం కూడా ఫిక్స్ అయింది. మే 19 అర్థరాత్రి 12 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ 'Mega158' గురించి తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ సరికొత్త మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో.. రగ్గడ్ గా కనిపించబోతున్నారని సమాచారం. విభిన్నమైన హెయిర్ స్టైల్, గడ్డంతో చిరు వింటేజ్ మాస్ లుక్‌ను తలపించేలా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్.
డైరెక్టర్ గా మారుతున్న రామ్ పోతినేని!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారబోతున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన అన్న కృష్ణ చైతన్యతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
రవితేజ రెమ్యూనరేషన్‌లో భారీ కోత!
తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రవితేజ.. తన రాబోయే చిత్రాల కోసం దానిని రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ నిలదొక్కుకునే వరకు బడ్జెట్ నియంత్రణలో ఉండాలని, తద్వారా సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట.
విజయ్ సీఎం కావడంపై రజినీకాంత్ రియాక్షన్!
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ కు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు విజయ్ సీఎం కావడంపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. రజినీకాంత్ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, కేవలం తనదైన శైలిలో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజినీకాంత్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఆ చిరునవ్వులో విజయ్ పట్ల గౌరవం, అభినందనలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సూర్య సినిమాకు కొత్త తలనొప్పి!
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్‌జే బాలాజీ ఇప్పుడు తెలుగు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వీర భద్రుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో.. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు.
విడాకుల బాటలో మౌనీ రాయ్
బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త, దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట గత కొద్ది రోజులుగా విడివిడిగా నివసిస్తున్నారని, వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మౌనీ తన ప్రొఫైల్ నుండి భర్తతో ఉన్న కొన్ని ఫోటోలను తొలగించగా, సూరజ్ కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్లు సమాచారం.
ప్రముఖ సింగర్ కు జైలు శిక్ష
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. గత మార్చిలో కాలిఫోర్నియాలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన బ్రిట్నీపై నమోదైన కేసులో, తాజాగా ఆమెకు ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు 571 డాలర్ల జరిమానాను కోర్టు విధించింది.





