టాలీవుడ్ ఏ విషయంలో మారినా, రికార్డుల కోసం పాకులాడే విషయంలో మాత్రం మారదు... మారబోదు. ఇది వరకు కేవలం రికార్డుల కోసమే బలవంతంగా ఓ సినిమాని వంద రోజులు ఆడించేవారు. `మా హీరో సినిమానే ఎక్కువ కేంద్రాల్లో వంద ఆడింది` అని చెప్పుకొనేవారు. ఆ జాడ్యం ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. అదిపోయి.. `మా హీరో సినిమా తొలి రోజు ఇంత సాధించిందీ, అంత సాధించిందీ` అని గొప్పలు చెప్పుకోవడం మొదలెట్టారు. ఆఖరికి యూ ట్యూబ్ హిట్స్‌కి కూడా వదలడం లేదు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా అర్చన థియేటర్లో ఏకంగా 1000 రోజులు ఆడబోతోంది. ఇది సౌతిండియాలోనే రికార్డు. 1000 తరవాత ఉంచుతారా, తీసేస్తారా అనేది ఇంకా తెలీదు. అర్చన థియేటర్ యజమాని బాలయ్యకు వీర ఫ్యాన్. బాలయ్య అంటే పడి చచ్చిపోతాడు. అందుకే ఆ థియేటర్లో ఈ సినిమా వెయ్యి రోజులు ఆడుతోంది. నిజానికి 1000 రోజులు ఆడాల్సినంత స్టామినా లెజెండ్ సినిమాకు లేదు. 70 రోజుల తరవాత లెజెండ్ సినిమాకి కలక్షన్లు బాగా తగ్గిపోయాయి. ముక్కుతూ మూలుగుతూ వంద ఆడింది. ఆ తరవాత తీసేయాల్సిందే. కానీ థియేటర్ యాజమాన్యం ఏమనుకొందో... ఆ సినిమాని కంటిన్యూ చేయడం మొదలెట్టింది. వంద తరవాత థియేటర్లో పట్టుమని పదిమంది లేకపోయినా... సినిమా ఆడించేవారు. కొన్నాళ్లు బాలయ్య అభిమానులు పనిగట్టుకొని ఈ సినిమాకి రావడం మొదలెట్టారు. వాళ్లకు మొహం మెత్తేసింది. ఈ సినిమా టీవీల్లోనే చాలా సార్లు వచ్చింది. ఇక థియేటర్‌కి వెళ్లి ఏం చూస్తారు..?? ఇప్పుడు అర్చన థియేటర్ రిపేరు పనుల్లో పడింది. నేల బెంచి తప్ప టికెట్లు అమ్మడం లేదని తెలుస్తోంది. ఈ థియేటర్‌ని నమ్ముకొని చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. క్యాంటిన్, సైకిల్ స్టాండ్.. వగైరా, వగైరా. సినిమా మారితేగానీ... వాళ్లకు ఆదాయం రాదు. కేవలం రికార్డుల కోసమే ఓ సినిమాని ఇంత బలవంతంగా ఆడించడం ఎందుకు? అభిమానం ఉంటే వేర్వేరు రూపాల్లో చూపించుకోవాలి? మరీ ఇంతిలానా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రికార్డు కోసం పొట్టలు కొడతారా??
Oct 29, 2016 2:30PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






