Home

»

Latest News

సమ్మర్ హీరో నంబర్ వన్ ఎవరు...?

Jun 14, 2011 1:05PM

సమ్మర్ హీరో నంబర్ వన్ ఎవరు...? అనే ప్రశ్న తెలుగు సినీ పరిశ్రమలో నెలకొంది. మొన్న వేసవి కాలం శలవుల్లో విడుదలైన తెలుగు ముఖ్యమైన సినిమాల లిస్ట్ ఇది. యన్ టి ఆర్ "శక్తి", పవన్ కళ్యాణ్ "తీన్ మార్", ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్", నాగచైతన్య "100% లవ్", రవితేజ "వీర", అల్లు అర్జున్ "బద్రీనాథ్". ఈ సినిమాల తొలి రోజు కలెక్షన్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహేర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మించిన "శక్తి" సినిమా చాలా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీనికి కారణంగా కథను సరిగ్గా విజువలైజ్ చేయలేక పోయిన దర్శకుడి వైఫల్యం కోట్టొచ్చినట్టు కనపడుతూంది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన "తీన్ మార్" సినిమా "కొమరం పులి" అంత ఘోరమైన ఫ్లాప్ కాకపోయినా, ఇదేమంత సుపర్ హిట్టేం కాదు.

ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన"మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమా 130 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని మంచి హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే నాగచైతన్య, తమన్నా జంటగా నటించగా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన "100% లవ్" సినిమా సూపర్ హిట్టయ్యింది. రవితేజ హీరోగా, తాప్సి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇందుకూరి నిర్మించిన "వీర" చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. ఈ సీజన్ లో చివరిగా గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, వినాయక్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మించిన "బద్రీనాథ్" కూడా ఘోరంగా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com