
ఒక మూవీలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తాడు. ఇలాంటి దారుణాలు చూసే కంటే వెంకీ ని వెతకడమే బెస్ట్ అని. ఇప్పుడు ఈ డైలాగ్ ని తెలుగు సినిమా ప్రేమికులు తమకి నచ్చిన, ప్రేక్షకులకి నచ్చిన సినిమాలకి అన్వహించుకోవాల్సిన పరిస్థితి. పూర్తి మ్యాటర్ ఏంటో చూసేద్దాం.
ఒకప్పుడు ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తే చాలు, థియేటర్ల ముందు ప్రేక్షకుల రద్దీ కనిపించేది, టికెట్ల కోసం పోటీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా బాగుంది, కథ బాగుంది, నటీనటుల నటన ఆకట్టుకుంది అనే పదాలు ఒక రేంజ్ లో వినపడుతున్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదనే మాట గట్టిగా వినిపిస్తోంది.
ఈ మార్పు వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే ప్రేక్షకుల అలవాట్లలో వచ్చిన పెనుమార్పు స్పష్టంగా కనిపిస్తోంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ప్రేక్షకులు ఇప్పుడు ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు. టికెట్ ధరలు, పార్కింగ్, తినుబండారాల ఖర్చులు అన్నీ కలిపి కుటుంబంతో వెళ్తే పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో, సాధారణ పాజిటివ్ టాక్ ఉంటే సరిపోదని, తమ సమయానికి, పెట్టే ఖర్చుకు పూర్తి విలువ ఇచ్చే ప్రత్యేకమైన అనుభూతి ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. మిగిలిన సినిమాల కోసం కొద్దివారాలు ఓపిక పట్టి ఓటీటీలో చూడటానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు, బాక్సాఫీస్ గణాంకాలు ఈ రంగంలో నెలకొన్న భిన్నమైన ధోరణులను బయటపెడుతున్నాయి. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో కూడా కలెక్షన్ల ఊగిసలాట కనిపిస్తోంది. ఉదాహరణకు, సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన 'రామాయణ' తొలి భాగం నవంబర్ 5న విడుదలై 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,435.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినా, 2,500 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, పైగా సోమవారం నాడు వసూళ్లలో 57 శాతం పతనమయ్యాయి.
ఇది కూడా చదవండి:నితిన్‌పై నాని ప్రశంసల వర్షం..'అలియాస్ రుక్మిణి'తో ఈ సారి!
అదే సమయంలో, ఇండియన్ బాక్సాఫీస్ తొలి రోజు రికార్డుల పరంగా చూస్తే 'పుష్ప 2: ది రూల్' మొదటి రోజు 32,140 షోల ద్వారా 164.25 కోట్ల రూపాయల నెట్, 275.01 కోట్ల రూపాయల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది, ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' 223 కోట్ల రూపాయల గ్రాస్, 'బాహుబలి 2' 217 కోట్ల రూపాయల గ్రాస్‌తో నిలిచాయి.
ఇదే క్రమంలో మిడ్-బడ్జెట్ సినిమాల విజయాలు కూడా మరో కోణాన్ని చూపిస్తున్నాయి. 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వచ్చిన 'డీసీ' 14 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువ కావడం, అలాగే సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్లోని 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టు 14న విడుదలై కేవలం 5 రోజుల్లోనే 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి 200 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోవడం గమనార్హం. ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే, కేవలం పైపై పాజిటివ్ టాక్ మాత్రమే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద నోట్ల వర్షం కురిపించడం లేదు. ప్రేక్షకుల అంచనాలను అందుకునే బలమైన కంటెంట్, సోషల్ మీడియా హైప్, సరైన రిలీజ్ టైమింగ్, బలమైన మౌత్ పబ్లిసిటీ ఉంటేనే కలెక్షన్లు నిలబడుతున్నాయి.

టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు టాక్‌తో పాటు థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించే అసలు ఫార్ములాపై కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒక్క నిజం ఏంటంటే 'హిట్ టాక్ వచ్చినా థియేటర్లలో రష్ లేకపోవడం, కలెక్షన్లు తక్కువగా ఉండటం అభిమానులని, సినీ ప్రేమికులని ఇండస్ట్రీ వర్గాలని కలవరపెడుతోంది.
మీకు నచ్చవచ్చు: బిజిఎంకి అర్ధం తెలిసిందోచ్!
మీకు నచ్చవచ్చు: సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా పెళ్లి..ఆ హీరో ఎవరనుకుంటున్నారు!
[Tollywood, Positive Talk, Box Office Collections, Public Talk]




.webp)
