Home

»

Latest News

ఎన్టీఆర్, బ‌న్నీ... మైండ్ బ్లోయింగ్ కాంబో

Nov 21, 2016 10:00AM

టాలీవుడ్‌లో మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ రాబోతోందా?  ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నారా?  ఆ అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లు క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని, దానికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత పూరి ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇజం రిజ‌ల్ట్‌తో పూరికి ఛాన్స్ ఇవ్వ‌డానికి ఎన్టీఆర్ భ‌య‌ప‌డ్డాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై ఆశ‌లు వ‌దులుకొన్నాడు. అయితే ఈలోగా పూరికి ఓ కొత్త ఆలోచ‌న వ‌చ్చింది. ఎన్టీఆర్‌, బ‌న్నీల‌తోఇద్ద‌రితోనూ సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌న్న‌దే ఆ ఆలోచ‌న‌.

అది రాగానే.. త‌న ద‌గ్గ‌రున్న ఓ పాత క‌థ బూజు దులిపి.. ఎన్టీఆర్‌, బ‌న్నీలకు క‌థ వినిపించ‌డానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఎన్టీఆర్‌, బ‌న్నీల‌తో పూరికి మంచి అనుబంధ‌మే ఉంది. ఇద్ద‌రితోనూ చెరో రెండు సినిమాలూ చేశాడు. పైగా పూరి ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా, ఆయ‌న‌పై ఎప్పుడూ గురి ఉంటూనే ఉంటుంది. మంచి క‌థ అనిపిస్తే, మ‌ల్టీస్టార‌ర్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అనుకొంటే.. వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టించ‌డానికి సిద్ద‌మే. మ‌రి ఈ కాంబో సెట్ అవుతుందా, లేదా?  అనేది పూరి చెప్ప‌బోయే క‌థ‌పై ఆధార‌ప‌డి ఉంది. మ‌రి పూరి ఏం చేస్తాడో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com