
హీరో.. ఈ సినీ పర్సనాలిటీ ఇచ్చే ఇచ్చే ఆనందాన్ని ఆ దేవుడు కూడా ఇవ్వలేడు. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అభిమానిని, ప్రేక్షకుడిని అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ హీరోకి వచ్చిన కష్టం సినిమాలో మనల్ని ఇబ్బంది పెట్టే ఎంత క్రూరమైన విలన్ కి కూడా రాకూడదు. అందుకే హీరో తన రూటు మార్చుకున్నాడు. ఇదంతా అభిమానులు, ప్రేక్షకుల కోసమే.
ఇప్పటివరకు కేవలం నటనకే పరిమితమై, సెట్స్‌పై దర్శకుడు చెప్పినట్లు చేస్తూ వచ్చిన యంగ్ హీరోలు ఇప్పుడు తమ రూట్ మారుస్తున్నారు. సినిమాల్లో కేవలం నటులుగానే కాకుండా కథా రచయితలుగా, నిర్మాతలుగా, చివరకు దర్శకులుగా కూడా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ హిట్ కొట్టి తమ మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి, తమలోని మల్టీ టాలెంట్‌ను బయటకు తీస్తూ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ వరుసలో మన టాలీవుడ్ యంగ్ స్టార్స్ రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం, కార్తికేయ గుమ్మకొండ ముందు వరుసలో నిలుస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. అయితే 'ఆంధ్ర కింగ్ తాలూకా' ప్రాజెక్ట్ నుండి రామ్ తనలోని హిడెన్ టాలెంట్లను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం నటుడిగానే కాకుండా ఒక పాట రాసి లిరిసిస్ట్‌గా, అలాగే ఆ పాటను పాడి సింగర్‌గా కూడా అవతారమెత్తారు. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ సీటులో కూర్చోవడానికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. రామ్ పోతినేని తన కెరీర్‌లో రాబోతున్న 23వ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ (RAPO23)తో 'కెప్టెన్ ఆఫ్ ది షిప్' బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది ఒక పవర్‌ఫుల్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది కుడా చదవండి: కరీనా కపూర్ ఆస్తుల విషయంలో ట్విస్ట్: ఆస్థి మొత్తం విలువ ఇంతే!
మరోవైపు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇదే బాటలో పయనిస్తూ ఆల్ రౌండర్‌గా మారుతున్నారు. ఒకవైపు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే, మరోవైపు నిర్మాతగా మారీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు బాధ్యతలతో పాటు దర్శకత్వం వైపు కూడా తన దృష్టి మళ్లించారు. కిరణ్ అబ్బవరం తన 13వ సినిమాకు (KA13) స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం ఒక కలర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుండగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ టైటిల్ మరియు ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రానుంది.
.webp)
ఇక వీరిద్దరి బాటలోనే నడుస్తూ డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తున్న మరొక యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ. 'ఆర్‌ఎక్స్ 100', 'భజే వాయు వేగం' వంటి చిత్రాలతో మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పించిన కార్తికేయ, ఇప్పుడు డైరెక్టర్‌గా మారి తన లక్‌ను పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇస్తూ మెగాఫోన్ పట్టబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఒక బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ కథతో వస్తున్న ఈ సినిమా ద్వారా కార్తికేయ సరికొత్త కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పరిశ్రమలో హిట్టు సాధించడానికి, తమ విజన్ ప్రకారం కథలను రూపొందించడానికి యంగ్ హీరోలు ఇలా రైటర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లుగా మల్టీటాస్కింగ్ చేయడం టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. ఈ యంగ్ స్టార్స్ ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద ఏ రకమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి!
[Tollywood Heroes Turn Directors For Hit,Ram Pothineni, Kiran Abbavaram KA13, Kartikeya Gummakonda Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





