
'ప్యారడైజ్' మూవీ విడుదల సందర్భంగా టాలీవుడ్‌లో స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో మరోసారి చర్చ మొదలైంది. సినిమా హిట్ కావాలంటే దర్శకుడి విజన్ ఎంత ముఖ్యమో.. అదే సమయంలో స్టోరీ, స్క్రీన్‌ప్లే రాసే విషయంలో నిపుణుల అవసరం కూడా అంతే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ప్రతి వారం ప్రేక్షకులను నిరాశపరిచే సినిమాలు వస్తూనే ఉన్నాయని.. దర్శకులు తమ ప్రధాన బాధ్యత అయిన డైరెక్షన్‌పై ఫోకస్ చేసి, రైటింగ్‌ను నిపుణులకు అప్పగిస్తే మంచి ఫలితాలు రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే అందరు దర్శకులకు ఇది వర్తించదనే వాదన కూడా ఉంది. కొందరు దర్శకులు కథ నుంచి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ వరకు అన్నింటినీ స్వయంగా హ్యాండిల్ చేసి అద్భుతమైన సినిమాలు అందించారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు దీనికి ఉదాహరణగా కనిపిస్తారు.
మరోవైపు వరుస పరాజయాలను చూస్తున్న కొందరు మాత్రం ప్రొఫెషనల్ రైటర్స్ అవసరాన్ని గుర్తించాల్సిన అవసరముంది. కథను రాసే వ్యక్తి, దాన్ని తెరపైకి తీసుకెళ్లే దర్శకుడు ఇద్దరూ తమ తమ విభాగాలపై ఫోకస్ చేస్తే సినిమా మరింత బలంగా తయారవుతుందనే చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ప్యారడైజ్ చుట్టూ రాజకీయం.. ఒక్క పూటలోనే సీన్ రివర్స్.!
ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’పై పడింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రెడిట్స్ కూడా ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. రచన, దర్శకత్వం వంటి విభాగాల్లో స్పష్టమైన విభజన ఉండటం వల్ల.. ఒక టీమ్‌గా పనిచేస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందో ‘డ్రాగన్’ చూపిస్తుందనే ఆసక్తి నెలకొంది.
దర్శకుడు ప్రతి విభాగాన్నీ తన చేతుల్లోనే ఉంచుకోవాలా? లేక కథ, స్క్రీన్‌ప్లే కోసం ప్రత్యేకమైన రైటర్స్‌ను తీసుకోవాలా? అనే చర్చ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రాజమౌళి వంటి అగ్ర దర్శకుల సినిమాల్లో కూడా రైటింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటం ఈ చర్చకు మరింత బలం ఇస్తోంది.
మరి.. భారీ బ్యాక్‌డ్రాప్, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌తో వస్తున్న ‘డ్రాగన్’ కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఎలాంటి స్టాండర్డ్ సెట్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ప్రేక్షకుల ఆశలు మాత్రం ఈ సినిమాపైనే ఉన్నాయి.
మీకు నచ్చవచ్చు:
రాయిని ఆడది చేసిన రాముడివా.. 44 ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.!
‘ప్యారడైజ్’పై నెగెటివిటీ.. నానిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా.?
[Tollywood Directors, Telugu Directors, The Paradise Movie, Nani Paradise, Jr NTR Dragon Movie, Prashanth Neel, SS Rajamouli, Varanasi Movie, Telugu Film News, Telugu News]






