
సినిమా(Cinema).. న్యాయబద్దంగా ఓవర్ నైట్ స్టార్ డమ్ తో పాటు కోట్లాది రూపాయల డబ్బుకి యజమానులుగా మార్చే కల్పతరువు. ఆ హంగామా మొత్తం ఎలా ఉంటుందంటే నీ పది జన్మలకి సరిపోయినంతగా ఉంటుంది. కానీ సినిమా హిట్ అయితేనే అదంతా దక్కుతుంది. సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ బాగుండాలి. అంటే కథ, కథనం ప్రేక్షకులని సమ్మోహన పరిచేదిగా ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే 'కంటెంట్ ఈజ్ కింగ్'. తెలుగు సినిమాతో పాటు ప్రపంచ సినిమాకి కూడా కంటెంట్ ఈజ్ కింగ్ సూత్రం వర్తిస్తుంది.
కానీ మన తెలుగులో ఇప్పుడు వచ్చే చాలా సినిమాలు కంటెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాలు. రీసెంట్ గా ఒక స్మాల్ మూవీ వచ్చింది. ప్రమోషన్స్ చాలా బాగా చెయ్యడంతో పాటు సినిమా హిట్ గ్యారంటీ అనే నమ్మకాన్ని ఇండస్ట్రీ వర్గాల్లో కలిపించారు. ఆ చిత్ర దర్శకుడు ఎంతో మేధావిలా మీడియా సమావేశాల్లో పాల్గొని సినిమా గురించి చెప్పిన మాటలు వింటే మనకి ఐ ఫీస్ట్ పక్కా అని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయ్యారు. కానీ సినిమా రిలీజైన తర్వాత చూస్తే కంటెంట్ ని పూర్తి నిర్లక్ష్యం చేసాడు. కథ, కథనం, క్యారెక్టర్లు మొత్తం దారి తప్పాయి. కథ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ మూడ్ కి తగ్గ కథనాన్ని, క్యారెక్టర్స్ ని సృష్టించుకోలేకపోయాడు. దీంతో చాలా మంది ప్రేక్షకులు ఇంటర్వెల్ దాకా కూడా ఉండే దైర్యం చేయక, మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయన భార్య సైతం అదే సూత్రాన్ని అమలు చేస్తూ సినిమా మధ్యలోనే వెళ్లిపోయిందట. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.
Also read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. దాన్ని అంతం చేసే టైం వచ్చింది
అందుకే అంటారేమో ఒక గొప్ప డైరెక్టర్ , రైటర్ రాసిన గొప్ప కథని నిర్మాత, సినీ మేధావి ఒకే చెయ్యాలంటే డైరెక్టర్, రైటర్ బుర్ర కంటే గొప్ప బుర్ర గల వాడు కావాలి అని. ఇప్పుడు టాప్ లో మ్యాటర్ కంటే లాప్ టాప్ బ్యాచ్ ఎక్కువయ్యారనే న్యూస్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తూ ఉంది
Cinema, Content




