Home

»

Latest News

వెంకటేశ్వరస్వామి గుడి సెట్ వేసేస్తున్నారు!

Jun 28, 2016 11:03AM

లేనివి ఉన్నట్లుగా చూపించడంలో మన సినిమావాళ్లు చాలా ముందుంటారు. నాగార్జున నటించిన "అన్నమయ్య" సినిమాలో తిరుపతి కొండలు ఎక్కుతూ ఒక పాట ఉంటుంది. అప్పట్లో ఆ పాట చూసివాళ్ళందరూ "అవి నిజంగానే తిరుపతి కొండలు" అని నమ్మేశారు. అయితే.. నిజానికి అవి హైద్రాబాద్ లో ని అన్నపూర్ణ స్టూడియోస్ కింద ఉన్న ఫారెస్ట్ లొకేషన్. అలాగే మరో మారు ప్రేక్షకుల్ని మైమరపించనున్నారు నాగార్జున. ఆయన ముఖ్యపాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించనున్న "ఓం నమో వెంకటేశాయ" సినిమా కోసం మళ్ళీ అదే అన్నపూర్ణ స్టూడియోలో ఏకంగా వెంకటేశ్వరస్వామి గుడి సెట్ వేసేస్తున్నారు. ఇప్పటికే పనులు మొదలైపోయాయి. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుష్క, విమలారామన్, పావని గంగిరెడ్డి ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రంలో నాగార్జున వెంకటేశ్వరుడి భక్తుడు హతీరామ్ బాబాగా కనిపించనున్నాడు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com