Home

»

Latest News

'తుడక్కమ్' ట్విట్టర్ రివ్యూ.. మోహన్‌లాల్ కూతురి ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే.?

Aug 7, 2026 4:33PM

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయా మోహన్‌లాల్ (Vismaya Mohanlal) నటిగా ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ మూవీ 'తుడక్కమ్' (Thudakkam). '2018' లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అందించిన జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈరోజే థియేటర్లలోకి వచ్చేసింది. 

'తుడక్కమ్' అంటే మలయాళంలో 'ఆరంభం' అని అర్థం. ఈ సినిమాతో విస్మయాతో పాటు ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ కూడా పవర్‌ఫుల్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మీనూ అనే ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి కథ ఇది. బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి సిటీకి వెళ్లి అనూహ్యంగా ఒక ప్రమాదకరమైన మర్డర్ మిస్టరీ చిక్కుముడిలో పడిపోతుంది. అక్కడి నుంచి ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే సర్వైవల్ అండ్ ఫైటింగ్ అడ్వెంచరే ఈ 'తుడక్కమ్'.

ట్విట్టర్ లో ఈ సినిమా చూసిన క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ చెబుతున్న మాట ఏంటంటే.. "విస్మయా మోహన్‌లాల్ డెబ్యూ పర్ఫెక్ట్ గా కుదిరింది". ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ లో విస్మయా నటన చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఒరిజినల్ గా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయి కావడం వల్ల, యాక్షన్ సీక్వెన్సెస్ లో ఇరగ్గొట్టేసింది. నిజంగా ఫైట్స్ చేస్తున్నంతసేపు స్క్రీన్ పై తండ్రి మోహన్‌లాల్ ఫ్లేవర్ స్పష్టంగా కనిపించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు, సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్. జూడ్ ఆంటోనీ డైరెక్షన్, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో మోహన్‌లాల్ ఎంట్రీ థియేటర్లను షేక్ చేసిందట. డైరెక్టర్ జూడ్ ఆంటోనీ “నన్ను సినిమా మాయాజాలంలోకి లాగిన నా నట విక్రాంతుడికి నా ఇష్టపూర్వక సమర్పణ” అని టైటిల్ కార్డ్స్ లో వేసిన ట్రిబ్యూట్ కి మోహన్‌లాల్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

అయితే సినిమాలో కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయని ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. విస్మయాకు మలయాళం సరిగ్గా రాకపోవడం వల్ల ఆమె క్యారెక్టర్ కి వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. దీనివల్ల కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ లో ఎక్స్‌ప్రెషన్స్ కి, డబ్బింగ్ కి సింక్ తప్పిందనే టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా మొదలైనప్పటికీ, ఇంటర్వెల్ బ్లాక్ నుండి సెకండ్ హాఫ్ చివరి వరకు ఒక గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా సాగుతుందట.

మొత్తానికి ‘తుడక్కమ్’ చిత్రం విస్మయా కెరీర్ కి ఒక గ్రాండ్ ఆరంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తన మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీన్స్ తో ఒక సాలిడ్ హీరోయిన్ గా థియేటర్లలో విజిళ్లు వేయించుకోవడం నిజంగా గ్రేట్.

 

 

Mohanlal Daughter, Vismaya Mohanlal, Thudakkam Review

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com