
అగ్ర హీరో మోహన్‌లాల్ గత నాలుగు దశాబ్దాల నుంచి మళయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు మోహన్‌లాల్ ముద్దుల కుమార్తె విస్మయ కూడా వెండితెరపైకి అడుగుపెట్టింది.
విస్మయ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘తొడక్కమ్’ఇటీవల థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. '2018' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల మనసులను సైతం గెలుచుకుంటోంది.బాక్సాఫీస్ విషయానికి వస్తే, 'తొడక్కమ్' చిత్రం మొదటి రోజు నుంచే థియేటర్లలో స్థిరమైన వసూళ్లను సాధిస్తోంది. తొలి రోజైన శుక్రవారం నాడు ఇండియా నెట్ కలెక్షన్ల రూపంలో 2.55 కోట్లు రాబట్టి శుభారంభం చేసింది. రెండవ రోజైన శనివారం నాటికి ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల కలెక్షన్లు ఏకంగా 37.3 శాతం పెరిగి 3.60 కోట్లకు చేరుకున్నాయి.
మొదటి రెండు రోజుల్లోనే భారతదేశ వ్యాప్తంగా నెట్ కలెక్షన్లు 6.05 కోట్లకు పెరగ్గా, ఇండియా గ్రాస్ కలెక్షన్ 7.02 కోట్లకు చేరుకుంది. మూడవ రోజు అంటే ఆదివారం నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత ఉధృతాన్ని చూపించింది. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 18.1 శాతం గ్రోత్‌తో 4.25 కోట్ల భారీ నెట్ కలెక్షన్ సాధించి ఆశ్చర్యపరిచింది. ఆ రోజు ఏకంగా 1,212 షోలలో ప్రదర్శించబడగా, రాత్రి షోలకు ఏకంగా 77.17 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. మొత్తం మీద ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా సగటున 63 శాతం ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.
Also read: బిగ్ షాక్: రవితేజ చిత్రం నుంచి తప్పుకున్న మైత్రి మూవీ మేకర్స్ !
దీంతో కేవలం మూడు రోజుల్లోనే 'తొడక్కమ్' ఇండియా నెట్ కలెక్షన్ 10.40 కోట్లను దాటేయగా, ఇండియా వ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్ 12.06 కోట్లకు చేరింది. కేవలం భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా విస్మయ డెబ్యూ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. విదేశాల్లో ఆదివారం నాటికి ఓవర్సీస్ గ్రాస్ 11.40 కోట్లకి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే దాదాపు 23.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. మోహన్‌లాల్ ఒక ప్రత్యేక క్యామియో పాత్రలో మెరిసి అభిమానులకి మరింత కిక్ ఇచ్చాడు
Vismaya, Mohanlal, Thudakkam






