Home

»

Latest News

తీన్ మార్ క్లైమాక్స్ ఫైట్ పవన్ కంపోజింగ్

Apr 15, 2011 5:51PM

"తీన్ మార్" క్లైమాక్స్ ఫైట్ పవన్ కంపోజింగ్ చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం "తీన్ మార్". ఈ చిత్రం నిన్ననే విడుదలై కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైల్, ద్విపాత్రాభినయంలో ఆయన నటన, త్రిష, కృతి కర్బందా అందచందాలు, మణిశర్మ వీనుల విందైన సంగీతం, జయంత్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ఘనవిజయాన్ని చేకూర్చాయి.

teen maar wallpapers, teen maar stills, teen maar images, teen maar pics, teen maar photos, teen maar pictures

ఈ "తీన్ మార్" చిత్రానికి నిజానికి టినూ వర్మ యాక్షన్ సీన్లను కంపోజ్ చేశారు. అయితే ఈ "తీన్ మార్" చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ ని మాత్రం హీరో పవన్ కళ్యాణే కంపోజ్ చేశారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అందుకే ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ లో ఫైట్ అంత స్టైల్ గా, సహజంగా ఉందని వారంటున్నారు. ఈ విషయాన్ని "తీన్ మార్" చిత్రం యూనిట్ ఇంకా ధృవపరచలేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com