Home

»

Latest News

పవన్ ది షాడో మే 6 నుండి కలకత్తాలో

May 2, 2011 6:43PM

పవన్ "ది షాడో" మే 6 నుండి కలకత్తాలో ప్రారంభం కానుందని ఈ చిత్రం యూనిట్ తెలిపింది. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఆర్ట్స్, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ దియాస్ హీరోయిన్ గా, అడివి శేషు ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, అంజలీ లావణ్య మరో హీరోయిన్ గా నటిస్తూండగా, ప్రముఖ తమిళ దర్శకుడు, తమిళ్ "బిల్లా" ఫేం విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న చిత్రం "ది షాడో".

pawan kalyan wallpapers, pawan kalyan stills, pawan kalyan images, pawan kalyan pics, pawan kalyan photos, pawan kalyan pictures

పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రంలో రెండవ హీరోయిన్ గా, కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2011 లో స్థానం సంపాదించుకున్న ముంబాయి ముద్దుల గుమ్మ 27 యేళ్ళ అంజలి లావణ్య నటించనుందని "మే" 2 వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సినీ మ్యాక్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ చిత్రం యూనిట్ తెలిపింది. కలకత్తాలోనే పూజతో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న"ది షాడో" చిత్రాన్ని ప్రారంభిస్తామనీ, మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ ఎంటర్ టైనర్‍ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, మరో హీరో అడివి శేషు, ఈ చిత్ర మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com