Home

»

Latest News

ది ప్యారడైజ్ స్టోరీ లీక్: అసలు కథ ఇదేనా?

Sep 12, 2026 6:59PM

 

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల మాస్ రగ్ డ్ మూవీ  'ది పారడైజ్ 'ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దమవుతుంది. ఆయా షేర్', 'యేష నాగుల' సాంగ్స్పవర్ ఫుల్ గ్లింప్స్ నెట్టింట సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా కథకి  సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలనాత్మక వార్త లీక్ అయి వైరల్ అవుతోంది. 

ఈ లీక్ ప్రకారం కథ మొత్తం ఒక అణచివేయబడిన గిరిజన తెగ చుట్టూ, 1960 - 1980ల నాటి పీరియడ్ నేపథ్యంలో తిరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఈ చిత్రంలో నాని ఇప్పటివరకు ఎన్నడూ చూడని రఫ్ అండ్ రస్టిక్ అవతార్‌లో పొడవాటి జడలతో కనిపిస్తున్నారు. లీక్ అయిన కథనం ప్రకారం, ఈ చిత్రం సమాజంలో అణచివేతకు గురైన శవరి తెగ పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. నాని తన 18 సంవత్సరాల సినీ ప్రస్థానంలోనే ఇది అత్యంత కష్టమైన, మానసికంగా మరియు శారీరకంగా శ్రమతో కూడుకున్న క్యారక్టర్  అని ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో స్వయంగా వెల్లడించారు. 

 

 

 

Also Read: 90లనాటి ఐకానిక్ కామెడీ వినోదం: ఇప్పటి సినిమాల్లో ఆ మ్యాజిక్ మిస్ అవుతోందా?

సోషల్ మీడియాలో ఈ సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఇందులో तब्బుల 1,000 మందితో భారీ ఫైట్ సీక్వెన్స్ ఉంద ని, సీక్రెట్ అండర్‌వాటర్ యాక్షన్ ఎపిసోడ్‌లు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ, హీరో నాని స్వయంగా స్పందిస్తూ 1,000 మందితో ఫైట్ గానీ, అండర్‌వాటర్ సీక్వెన్స్‌లు గానీ ఇందులో లేవని క్లారిటీ ఇచ్చారు.  టీజర్ చూసి ఇదొక కేవలం రక్తం చిందే వైలెంట్ యాక్షన్ సినిమా మాత్రమే అనుకుంటే పొరపాటేనని, ఇది ఒక బలమైన అమ్మా, కొడుకుల సెంటిమెంట్ కథ అని మేకర్స్ స్పష్టం చేశారు. "పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది" అనే కాళోజీ నారాయణరావు గారి అమూల్యమైన మాటల ప్రేరణతో ఈ సినిమా కథను శ్రీకాంత్ ఓదెల మలిచారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పటికీ, తమ సొంత ప్రాంతంలోనే గుర్తింపు లేక అన్యాయానికి గురైన ఒక తెగ తిరుగుబాటు ఆధారంగా 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేషన్ పొందిన ఈ సినిమాకు అనౌన్స్‌మెంట్ ట్రైలర్ విడుదల చేయడం లేదని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

[The Paradise , The Paradise Story Leak, Nani, Srikanth Odela, Anirudh Ravichander, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com