Home

»

Latest News

Inside Talk: 'ప్యారడైజ్'కి జరిగిన ద్రోహం.. లేటుగా వెలుగులోకి.. రగిలిపోతున్న నిర్మాత.!

Oct 7, 2026 6:48PM

సినిమా తీయడం ఒకెత్తయితే.. దానిని కాపాడుకోవడం మరో ఎత్తు. కొందరు టెక్నీషియన్లు తెలిసీతెలియక చేసే పనుల వల్ల.. సీనో, సాంగో, ఏకంగా సినిమానో లీకైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక ప్రముఖ టెక్నీషియన్ కావాలని చేసిన నమ్మక ద్రోహం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అతనొక ప్రముఖ టెక్నీషియన్. టాలీవుడ్ లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తుంటాడు. రీసెంట్ గా 'ప్యారడైజ్' సినిమాకు వర్క్ చేశాడు. రిలీజ్ కి ముందే రెమ్యూనరేషన్ కోటిన్నర ముట్టాయి. అంత రెమ్యూనరేషన్ తీసుకున్న ఆ వ్యక్తి.. తనని నమ్మి ఒక పెద్ద సినిమా చేతిలో పెడితే ఎంత బాధ్యతగా ఉండాలి?. అతను ఆ బాధ్యతను మరిచాడు, విలువలను పక్కన పెట్టాడు. రిలీజ్ కి రెండు నెలల ముందే 'ప్యారడైజ్'  సినిమాను సీక్రెట్ గా తనకు తెలిసిన ఇద్దరు నిర్మాతలు బాబాయ్-అబ్బాయ్ లకు చూపించాడు. 

ఆ టెక్నీషియన్ చేసిన పని వల్ల 'ప్యారడైజ్'కి ఎంతో నష్టం జరిగింది. విడుదలకు ముందు సినిమా మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. సినిమా ఎలా ఉండబోతుందో ముందే బయటకు లీక్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయింది అంటూ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 

ఒక టెక్నీషియన్ సీక్రెట్ గా ఇద్దరికి సినిమా చూపించడం, ఆ తర్వాత సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ జరగడం.. ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

టెక్నీషియన్ చేసిన ద్రోహం గురించి ఆలస్యంగా తెలుసుకున్న నిర్మాత, హీరో రగిలి పోతున్నారట. హీరో తన అసహనాన్ని వ్యక్తం చేయగా.. నిర్మాత మాత్రం ఆ టెక్నీషియన్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. సినిమాలు రాకుండా చేస్తానని బెదిరించడమే కాకుండా.. తన తోటి నిర్మాతలకు ఫోన్లు చేసి, అతని చేసిన మోసాన్ని వివరించాడట. 

అతను ఎంత పెద్ద టెక్నీషియన్ అయినప్పటికీ.. తను చేసిన పని చాలామంది నిర్మాతలకు కోపం తెప్పించింది. ఇప్పుడు వీళ్ళని మోసం చేశాడు.. రేపు మనల్ని చేస్తాడు. ఇలాంటి విలువలు లేని వ్యక్తిని కాంపౌండ్ లోకి కూడా రానివ్వొద్దని పలువురు నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అతని కెరీర్ కి ఇది బ్లాక్ మార్క్ అని, అతన్ని నమ్మి వేరే నిర్మాతలెవరూ సినిమాలు ఇచ్చే పరిస్థితి ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ సెన్సార్ రిపోర్ట్.. మొదటి భాగం కంటే రెండో భాగం కాస్త తగ్గింది.!

 

 

 

[The Paradise Movie, Nani Paradise Movie, Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com