Home

»

Latest News

బాక్సాఫీస్ రచ్చ: నెగిటివ్ టాక్‌లోను గంటకి ఎన్ని వేల టిక్కెట్లు బుక్ అవుతున్నాయో తెలుసా!

Sep 24, 2026 2:20PM


నాని వన్ మాన్ షో ప్యారడైజ్ మూవీ థియేటర్స్ లోకి రావడం, నెగిటివ్ టాక్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తు ఉండటం జరిగిపోతు ఉంది. కానీ కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లేదా కలెక్షన్లు రాబట్టడానికి  కష్టపడాల్సి వస్తుంది. కానీ 'ప్యారడైజ్’  విషయంలో మాత్రం సరికొత్త చరిత్ర పునరావృతమవుతోంది. 


సోషల్ మీడియాలోను  విమర్శకుల నుంచి కొంతవరకు నెగిటివ్ టాక్ వస్తున్నప్పటికీ, ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు. దానికి సజీవ సాక్ష్యమే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో నమోదవుతున్న అసాధారణ గణాంకాలు. బుక్ మై షో (BookMyShow) వంటి ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్‌లో గంటకు దాదాపు 25,000 కి పైగా టిక్కెట్లు అమ్ముడవుతుండటం ట్రేడ్ వర్గాలను, చిత్ర పరిశ్రమను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది! ఒక వైపు టాక్ తేడాగా ఉందని వార్తలు వస్తున్నా, గంటకు 25 వేల ప్రాతిపదికన ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేయడం నానికున్న మాస్ క్రేజ్‌కు, అపరిమితమైన స్టార్ పవర్‌కు అద్దం పడుతోంది. సినిమా ప్రీ-రిలీజ్ హైప్, అనిరుధ్ అందించిన మాసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నాని నటనలోని రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీ ప్రేక్షకులను థియేటర్ వైపు పరుగులు తీయిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కేవలం గత కొన్ని గంటల్లోనే లక్షలాది టిక్కెట్లు అమ్ముడై అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కిపోతుండటం సినిమా కలెక్షన్లకు బిగ్ బూస్ట్‌గా మారింది.


ఇది కూడా చదవండి: హీరోయిన్ అంటే లెక్క లేదా: కయదు లోహర్ కి అన్యాయం జరిగిందా!

 

 

మామూలుగా నెగిటివ్ లేదా డివైడ్ టాక్ వస్తే బుకింగ్స్ ఒక్కసారిగా పడిపోవడం సహజం. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.  తొలి రోజు కూడా పూర్తి కాకుండానే 60 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. 

 

[The Paradise, Nani, The Paradise Movie 25k Tickets Per Hour, Natural Star Nani, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com