'ప్రేమమ్'ని గుర్తు చేస్తున్న 'థాంక్యూ' టీజర్
on May 25, 2022
'మనం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'థాంక్యూ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్స్. ఈ సినిమా జూలై 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు మేకర్స్.
'నా సక్సెస్ కి నేనే కారణం' అంటూ చైతన్య చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన 'థాంక్యూ' టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అయితే టీజర్ లో గతంలో చైతన్య నటించిన 'ప్రేమమ్' సినిమా ఛాయలు కొద్దిగా కనిపిస్తున్నాయి. ప్రేమమ్ లో స్కూల్, కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ ఇలా హీరో జీవితంలో మూడు దశల్లో లవ్ స్టోరీలు ఉన్నట్లు గానే 'థాంక్యూ'లో కూడా మూడు దశల్లో ప్రేమ కథలు ఉన్నట్లు టీజర్ ని బట్టి అర్థమవుతోంది. జీవితంలో ఎంతో సాధించి సక్సెస్ ఫుల్ పర్సన్ ఎదిగిన చైతన్య.. టీనేజ్ లో మాళవికతో, కాలేజ్ టైంలో అవికాతో, ఆ తర్వాత రాశితో లవ్ ట్రాక్ ఉన్నట్లు టీజర్ లో చూపించారు. "నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే" అంటూ చైతన్య చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిసింది. రొమోన్స్, ఎమోషన్, యాక్షన్ కలగలిసిన టీజర్ ఆకట్టుకుంటోంది. విభిన్న లుక్స్ తో చైతన్య ఆకట్టుకున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
'ప్రేమమ్' సినిమా ఛాయలు ఉన్నప్పటికీ 'థాంక్యూ' టీజర్ ఆకట్టుకుంటోంది. 'మజిలీ', 'వెంకీ మామ', 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న చైతన్య.. 'మనం' దర్శకుడితో చేస్తున్న సినిమా కావడంతో 'థాంక్యూ'పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకొని 'థాంక్యూ' చైతన్యకు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Also Read