
జూన్ 3న విడుదలైన సూపర్ హిట్ మూవీ 'మేజర్' తర్వాత టాలీవుడ్ నుంచి విడుదలైన 'అంటే సుందరానికీ', 'విరాట పర్వం', 'పక్కా కమర్షియల్', 'ది వారియర్' వంటి మీడియం రేంజ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మిగిలిగాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'థాంక్యూ' కూడా చేరనుంది.
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'థాంక్యూ'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదలై డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. టికెట్ ధరలు, ఓటీటీలు, నెగటివ్ టాక్, వర్షాలు వంటి కారణాలతో ఈ సినిమా చైతన్య కెరీర్ లోనే దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. మొదటి రోజు 2.16 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. చైతన్య గత చిత్రాలు ఫస్ట్ డే కేవలం తెలుగు స్టేట్స్ లోనే రూ.7 కోట్లకు పైగా షేర్ రాబడితే.. 'థాంక్యూ' మూవీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ కే పరిమితమైంది. రెండో రోజైతే 94 లక్షల షేర్ కి పడిపోయింది. దీన్ని బట్టి చూస్తే రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 3.10 కోట్ల షేర్ మాత్రమే రాబట్టిన ఈ మూవీ ఫుల్ రన్ లో 5-6 కోట్ల లోపు షేర్ కి పరిమతమయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఈ సినిమా బయ్యర్లకు దాదాపు 18-19 కోట్ల నష్టాలను మిగిల్చే అవకాశముంది. కొంతకాలంగా వరుస విజయాలను అందుకుంటున్న చైతన్యకు ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు.
రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.






