ఇదేం అరాచకం రష్మిక.. బాలీవుడ్ కి బాగా చెప్పావుగా
on Sep 29, 2025

తెలుగుతో పాటు, హిందీలో వరుస విజయాల్నితన ఖాతాలో వేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna).ప్రస్తుతం హిందీలో 'ధామా'(Thamma)అనే చిత్రం చేస్తుంది. రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫిలిం గా తెరకెక్కుతుండగా, ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana)హీరో. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'ధామా'పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది.
సదరు సాంగ్ ని రష్మిక, ఆయుష్మాన్ ఖురానా పై చిత్రీకరించగా 'తుమ్ మేరే నా హుయే'(Tum Mere Na huye)అనే బ్యూటిఫుల్ లిరిక్స్ తో సాంగ్ ప్రారంభమైంది.'తుమ్ మేరే నా హుయే' అంటే నువ్వు నావి కాదు అని అర్ధం. దీన్ని బట్టి సాంగ్ ఎంత రొమాంటిక్ టచ్ తో కూడిన లిరిక్స్ తో తెరకెక్కిందో అర్ధం చేసుకోవచ్చు. పైగా మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా మధ్య ఉన్న బాండింగ్ ని కూడా చెప్పినట్లయింది. ఇక రెడ్ కలర్ డ్రెస్ లో రష్మిక చేసిన డాన్స్ ఒక రేంజ్ లో ఉండటంతో పాటు ఎంతో కష్టతరమైన స్టెప్స్ ని కూడా అవలీలగా చేసింది. ఎంటైర్ తన కెరీర్ లో ఇంతవరకు అలాంటి డాన్స్ ని ప్రదర్శించలేదనే చెప్పాలి. సాంగ్ లో తాను ఒలకబోసిన అందాలు కూడా రేపు థియేటర్ లో అభిమానుల్ని,ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయుష్మాన్, రష్మిక మధ్య రొమాన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంది. పెర్ఫార్మెన్సు లోనే కాదు, డాన్స్ లోను తనకి తిరుగులేదని రష్మిక బాలీవుడ్ కి చెప్పినట్లయింది.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'చావా'(Chhaava)ని నిర్మించిన మధూక్ ఫిలిమ్స్ భారీ వ్యయంతో 'ధామా' ని నిర్మించింది. సచిన్ జిగర్ సంగీత దర్శకత్వంలో అమితాబ్ లిరిక్స్ ని అందించడంతో పాటు స్టార్ గాయని 'మహుబంతి' తో కలిసి ఆలపించడం జరిగింది. ఆదిత్య సర్పోట్ దర్( Aditya sarpotdar)దర్శకుడు కాగా నవాజుద్దీన్ సిద్దికి, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 21 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



