Home

»

Latest News

దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘ది థర్డ్’ ఎంపిక!

Apr 26, 2026

సీనియర్ జర్నలిస్ట్, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె దర్శకత్వంలో రూపొందిన ‘ది థర్డ్’ (The 3rd) అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ ప్రతిష్ఠాత్మకమైన 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) - 2026 కు అధికారికంగా ఎంపికైంది. న్యూ ఢిల్లీలో ఏప్రిల్ 30న జరగనున్న ఈ వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

కేవలం అకడమిక్ విజయాలే జీవిత పరమార్థం కాదని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని ‘ది థర్డ్’ చిత్రం చాటి చెబుతోంది.ప్రస్తుత విద్యా వ్యవస్థలో కార్పొరేట్ కళాశాలల ఒత్తిడి, ర్యాంకుల వేటలో నలిగిపోతున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల దయనీయ స్థితిని ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. 

‘న్యూటన్ థర్డ్ లా’ – అంటే ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అనే సూత్రాన్ని జీవితానికి అన్వయిస్తూ ఈ కథ సాగుతుంది. జీవితంలో ప్రతి సంఘటనకు ఈ సూత్రాన్ని ఆపాదించే ఒక అధ్యాపకుడికి, ఒకానొక సందర్భంలో ఎదురైన అనుభవం ఆయన ఆలోచనలనే మార్చివేస్తుంది. విద్యార్థుల ప్రాణాల కంటే ర్యాంకులే ముఖ్యం అనుకునే వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ చిత్రమని దర్శకుడు మునిసురేష్ పిళ్లె పేర్కొన్నారు.

ఆదర్శిని చిత్రాల పతాకంపై భారతమ్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలను సమకూర్చడం విశేషం. ఆదర్శిని శ్రీ, ఒబ్బు ప్రసాద్, సూరావజ్ఝుల రాము, పెమ్మరాజు విజయరామచంద్ర, డా. కిరణ్ కుమార్, బాలమురళి తదితరులు నటించారు. ఆదర్శిని భారతీకృష్ణ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com