
ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది..సినిమా లవర్స్ ఎప్పటికిప్పుడు రీఛార్జ్ చేసిన బ్యాటరీస్ లాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారా అని? వాళ్ల జోష్ కి కారణం ప్రతి వారం కంటిన్యూగా వస్తున్న సినిమా పండుగ.
నవంబర్ మూడో వారం కూడా ఎప్పటిలాగానే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరుకి రంగం సిద్ధమైంది. గత వారం విడుదలైన భారీ చిత్రాల సందడి కొనసాగుతుండగానే, ఈ వారం సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని ముఖ్యమైన సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
బాక్సాఫీస్ రేసుని ముందుగా ప్రారంభించబోతున్న చిత్రం 'ఈఎన్ఈ రిపీట్'. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్గా నిలిచిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్గా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ డ్రామా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
.webp)
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా ఇప్పటికే జోరు చూపిస్తోంది. విడుదలైన మొదటి రోజుకే 120 షోల ద్వారా సుమారు 13,531 టికెట్లు అమ్ముడై 28.78 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, నాలుగు రోజులకు కలిపి మొత్తం 23,019 టికెట్లతో 42.17 లక్షల రూపాయల ప్రీ-సేల్స్ నమోదు చేసింది. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 76 శాతం బుకింగ్స్ నమోదవ్వడం విశేషం.
ఇది కూడా చదవండి:తెలుగు హీరోకి 3 .5 కోట్ల కారు గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత: ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
మరోవైపు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ కీ రోల్స్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతి వ్యోమగామి కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయాణం, ఆమెకు అండగా నిలిచే కృష్ణ పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతిష్టాత్మక సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మించడం అతి పెద్ద ప్లస్ పాయింట్. . అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి.
వీటితో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'ఓం' (OM) 20 నే ల్యాండ్ అవుతుంది. డబ్బింగ్ అని అనుకోవడానికి కూడా లేదు. ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీ రోల్స్. అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు కావడం అతి పెద్ద ప్లస్ పాయింట్ లో ఒకటి. అమరన్ తర్వాత వస్తున్న మూవీ కూడా ఇదే. మరి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.
.webp)
ఇక ఈ పోటీలో పలానా చిత్రం విజయాన్ని అందుకంటుందని సోషల్ మీడియాలో రకరకాల పేర్లు చెప్తున్నారు. కానీ సినీ ప్రేమికులు మాత్రం ప్రతి సినిమా విజయాన్ని అందుకొని 'సినిమా' అనే మహత్తరమైన పదం గెలవాలని కోరుకుంటున్నారు.
మీకు నచ్చవచ్చు:నితిన్ కి హిట్టు వచ్చేసింది!
మీకు నచ్చవచ్చు: ఆ హీరో వచ్చేసాడు: అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో ఓకే నా!
[Aakasamlo Oka Tara, ee Nagaranki emaindi 2, Om, Dhanush, Dulqwer, viswak]






