Home

»

Latest News

పవన్ ది షాడో షూటింగ్ లో సారా జేన్

Jun 16, 2011 9:51AM

పవన్ "ది షాడో" షూటింగ్ లో సారా జేన్ పాల్గొంటుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర, ఆర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ హీరోయిన్ గా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమతిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ది షాడో". పవన్ "ది షాడో" షూటింగ్ లో హీరోయిన్ సారా జేన్ పాల్గొంటుందట. పవన్ "ది షాడో" షూటింగ్ జూన్ 26 వ తేదీ వరకూ కలకత్తా మహానగరంలో జరుతుంది.

రాజమౌళి ఈ సినిమా షుటింగ్ చూసి ఏవో మార్పులు చెప్పాడనీ, అందుకని కొన్ని సీన్లను రీషూట్‍ చేస్తున్నారనీ ఆ మధ్య ఒక రూమరు వచ్చింది. కానీ ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ఆ మాటల్ని నిర్ద్వందంగా కొట్టిపారేశారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా 60% షూటింగ్ పూర్తి చేసుకుంటుందని ఆయన అన్నారు. ఈ పవన్ "ది షాడో" సినిమాలో అడవి శేష్, అంజలీ లావణ్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ "ది షాడో" సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్నందిస్తుండగా, అబ్బూరి రవి మాటలు వ్రాస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com